Prabhas: ప్రభాస్ గొప్పదనం అదేనంటున్న తేజ.. ఏం జరిగిందంటే?

Prabhas: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడుగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న డైరెక్టర్ తేజ గురించి పరిచయం అవసరం లేదు ఏ విషయంలో అయినా సూటిగా మాట్లాడే తత్వం కలిగినటువంటి తేజ తాజాగా హీరో గోపీచంద్ ను ఇంటర్వ్యూ చేశారు. గోపీచంద్ హీరోగా నటించిన రామబాణం సినిమా మే 5వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో తేజ గోపీచంద్ ను ఇంటర్వ్యూ చేశారు. ఎన్నో రకాల ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు.

ఇక తేజ దర్శకత్వంలో వచ్చిన జయం సినిమాలో గోపీచంద్ కు విలన్ పాత్రలో అవకాశం కల్పించి తనను ఇండస్ట్రీకి పరిచయం చేశారు.ఈ క్రమంలోనే గోపీచంద్ మాట్లాడుతూ తనకు జయం సినిమాలో అవకాశం కల్పించాలని నా పేరు మీకు ఎవరు సూచించారు అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు తేజ సమాధానం చెబుతూ మీ డాడీ అంటూ సమాధానం తెలియజేశారు

 

గోపీచంద్ తండ్రి టి. కృష్ణ గారు ఇండస్ట్రీలో గొప్ప దర్శకుడిగా పేరు సంపాదించుకున్నారు. ఆయన వద్ద తేజ పనిచేశారని అయితే ఆయన మాట్లాడే మాటతీరు మంచితనం ఆయన ఇతరులకు ఇచ్చే మర్యాద తనకు ఎంతగానో నచ్చిందని, తల్లిదండ్రుల మంచితనం బిడ్డలకు మంచే చేస్తుందని దర్శకుడు తేజ తెలిపారు. ఇలా తన తండ్రి మంచితనం తనకు నచ్చడంతో తనని జయం సినిమాకు తీసుకున్నానని తేజ తెలిపారు.

 

కృష్ణంరాజు మెచ్చిన దర్శకులలో మీ నాన్న ఒకరనీ తేజ వెల్లడించారు. ఈ ఇంటర్వ్యూలో భాగంగా తేజ ప్రభాస్ గురించి మాట్లాడుతూ ఆయన మంచితనంపై ప్రశంసలు కురిపించారు. ప్రభాస్ మంచితనంలో 1000రెట్లు ఎంతో మంచివాడని, ఆ విషయంలో ప్రభాస్ గొప్పవాడు అంటూ తేజ ప్రభాస్ పై ప్రశంసలు కురిపించారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ప్రభాస్ మంచితనం గురించి తేజ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -