Hyderabad: నీటి గుంతకు బలైన మరొక చిన్నారి.. ఎక్కడో తెలుసా?

Hyderabad: ఈ మధ్యకాలంలో నీటి గుంతలలో బోరుబావులలో పడి చిన్నారులు ప్రాణాలను కోల్పోతున్నారు. దానికి తోడు ఈ మధ్యకాలంలో రెండు తెలుగు రాష్ట్రాలలో వర్షాలు జోరుగా ముంచెత్తుతుండడంతో ఎక్కడ చూసినా కూడా నీటి గుంతలలో ఎక్కువ మొత్తంలో నీళ్లు నిల్వ ఉంటున్నాయి. అలాగే చిన్నపాటి వర్షాలకే రోడ్లపై మోకాళ్ల లోతు నీళ్లు చేరిపోతున్నాయి. గుంతలు, నాలాలు, మ్యాన్ హోల్స్ వణికిస్తున్నాయి. ఇళ్లు మునిగిపోతున్నాయి, కార్లు, వాహనాలు ఈ వరద ధాటికి కొట్టుకుపోతున్నాయి. వీటి దెబ్బకు చిన్నారులు బలవుతున్నారు.

కాగా మొన్నటికి మొన్న సనత్ నగర్ కళాసి గూడ నాలాలో మౌనిక అనే చిన్నారి పడిపోయి మృతి చెందిన సంగతి తెలిసిందే. తాజాగా అలాంటి ఘటనే ఒకటి హైదరాబాద్‌ చోటు చేసుకుంది. తాజాగా హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో విషాదం చోటుచేసుకుంది. నీటి గుంతలో పడి వివేక్ అనే ఆరేళ్ల చిన్నారి మృత్యువాత పడ్డాడు. జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 45లో ఈ ఘటన చోటుచేసుకుంది. చెత్త కోసం అని ఒక గొయ్యి తవ్వగా అందులో ఇటీవల కురిసిన వర్షాలకు ఆ గుంత నీటితో నిండిపోయింది. తల్లిదండ్రులు ఇద్దరు పనిలో ఉండగా ఇతర పిల్లలతో కలిసి ఆడుకునేందుకు వెళ్లిన చిన్నారి వివేక్ ప్రమాదవశాత్తు ఆ గోతిలో పడిపోయాడు.

 

తనతో ఆడుకునేందుకు వచ్చిన మరో చిన్నారి పరుగున వెళ్లి తన తల్లిదండ్రులకు చెప్పగా అక్కడి వారు వెళ్లి తీసే సరికి అప్పటికే వివేక్ మృతి చెందాడు. కనీసం 10 అడుగుల లోతు గొయ్యి అని తెలుస్తోంది. కుమారుడు చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు విచారణను చేపట్టారు. కొడుకుని అలా చూసి తల్లిదండ్రులు గుండెలు వెలసేలా రోదిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -