NTR: ఆ పార్టీకి సపోర్ట్ చేస్తున్న యంగ్ టైగర్.. టీడీపీకి వణుకేనా?

NTR: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ సినీ ప్రస్థానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సీనియర్ నటుడు నందమూరి తారకరామారావు మనవడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఎన్టీఆర్ ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. అయితే ఎన్టీఆర్ రాజకీయాలలోకి వస్తే బాగుంటుందని ఎందరో అభిమానులు కోరుకుంటున్నారు కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం ఎన్టీఆర్ ను దూరం పెడుతూ వస్తున్నారు.

ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి వస్తే లోకేష్ రాజకీయ ఎదుగుదలకు అడ్డంగా ఉంటారని భావించినటువంటి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ను తెలుగుదేశం పార్టీకి దూరం పెట్టారు. అలాగే తాజాగా విజయవాడలో జరిగిన ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు కూడా ఎన్టీఆర్ ను ఆహ్వానించలేదు. ఇలా ఉద్దేశపూర్వకంగానే తనని దూరం పెడుతూ వస్తున్నారు కానీ తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ ను దూరం పెట్టిన బిఆర్ఎస్ పార్టీ మాత్రం తనని దగ్గరకు తీసుకుంటుందని తెలుస్తుంది.

 

ఇలా ఎన్టీఆర్ తెలంగాణలో అధికార పార్టీకి మద్దతు తెలుపబోతున్నారని తాజా పరిణామాలు చూస్తుంటే అర్థమవుతుంది. తాజాగా తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఎన్టీఆర్ ను కలిసి ఖమ్మం జిల్లాలో ఏర్పాటు చేయబోతున్న ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రావాలని తనని ఆహ్వానించారు. ఇలా జూనియర్ ఎన్టీఆర్ ను తెలుగుదేశం పార్టీ నేతలు దూరం పెట్టి తనని మరిచిపోయిన బిఆర్ఎస్ పార్టీ మాత్రం తనను గుర్తించి ఎన్టీఆర్ విగ్రహవిష్కరణకు ఆహ్వానం పలకడంతో ఎన్టీఆర్ వచ్చే ఎన్నికలలో తన మద్దతును
బిఆర్ఎస్ పార్టీకి ఇవ్వబోతున్నారా అన్న సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

 

ఇటీవల విజయవాడలో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ కి ఆహ్వానం అందలేదు. అయితే ఇందులో భాగంగా సూపర్ స్టార్ రజినీకాంత్ ముఖ్య అతిథిగా పాల్గొనడం స్వయంగా బాలకృష్ణ గన్నవరం విమానాశ్రయానికి వెళ్లి తనకి స్వాగతం పలకడం మనకు తెలిసిందే. ఇలా తన తాతగారి శతజయంతి వేడుకలకు ఎన్టీఆర్ ను ఆహ్వానించకపోవడంతో అభిమానులు ఎంతో ఆవేదన చెందారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -