Rajamouli: పోయి పోయి మహేష్ తో అలాంటి కథేంటి బాస్.. అవసరమా జక్కన్న!

Rajamouli: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అపజయం ఎరుగని దర్శకుడుగా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో దర్శకుడు రాజమౌళి ఒకరు.ఇప్పటివరకు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సినిమాలు ఏవి కూడా బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను నిరాశపరచలేదు. ఇక ఈయన దర్శకత్వంలో వచ్చిన RRRసినిమాకి ఆస్కార్ అవార్డు రావడంతో ఈయన ప్రతిభ ఎలాంటిదో అర్థమవుతుంది.ఇక రాజమౌళి దర్శకత్వంలో చేసిన హీరోలు అందరూ కూడా పాన్ ఇండియా స్టార్ హీరోలుగా గ్లోబల్ స్టార్స్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.

రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు తదుపరి సినిమా చేయబోతున్నారన్న విషయం మనకు తెలిసిందే.ఈ సినిమా గత సినిమాలను మించి ఉండబోతుందని రాజమౌళి వెల్లడించారు.ఇలా మహేష్ బాబు హీరోగా రాజమౌళి ఒక అద్భుతమైన కథను సిద్ధం చేయబోతున్నారని తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ పూర్తి చేసే పనిలో రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ ఉన్నారని తెలుస్తోంది.

 

మహేష్ ను రాజమౌళి తన సినిమాలో స్పైగా చూపించబోతున్నారని సమాచారం. ఈ మధ్య కాలంలో వచ్చిన స్పై సినిమాలు ఫ్లాపైన విషయం మనకు తెలిసిందే. ఇలా స్పైస్ త్రిల్లర్ సినిమాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతోమంది హీరోలు డిజాస్టర్ సినిమాలను తమ ఖాతాలో వేసుకున్నారు. ఈ క్రమంలోనే మహేష్ బాబుతో రాజమౌళి ఈ తరహా సినిమాని ప్లాన్ చేశారని తెలిసి మహేష్ అభిమానులు ఒకింత ఆందోళనకు గురవుతున్నారు.

 

మహేష్ బాబుతో మొదటిసారి రాజమౌళికి అవకాశం రావడంతో ఆయనతో ఇలాంటి కథలు తీసి రాజమౌళి మహేష్ బాబుని రిస్క్ లో పెట్టబోతున్నారా… మహేష్ బాబుతో ఇలాంటి కథలు చేయడం అవసరమా జక్కన్న అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. రాజమౌళి ఏ తరహా సినిమా అయినా చేస్తున్నారు. అంటే అందులో ఏదో ఒక విశేషం ఉంటుందని మహేష్ బాబు విషయంలో అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పలువురు ఈ విషయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -