Akkineni Heroes: అక్కినేని హీరోలకు కేవలం అలాంటి పాత్రలు మాత్రమే వస్తాయా?

Akkineni Heroes: ఒక్కో ఫ్యామిలీ నుంచి ఇద్దరు లేదా ముగ్గురు హీరోలుంటే అక్కినేని నందమూరి మెగా ఫ్యామిలీస్ నుంచి ఆ సంఖ్య భారీగానే వుంది. నందమూరి ఫ్యామిలీ నుంచి కేవలం ముగ్గురంటే ముగ్గురు హీరోలు బాలకృష్ణ ఎన్టీఆర్ కల్యాణ్ రామ్ మాత్రమే లైమ్ లైట్ లో స్టార్ లుగా వున్నారు. అక్కినేని ఫ్యామిలీ నుంచి ఐదుగురు హీరోలు లైన్ లో వున్నారు. కానీ ఎంత మంది ఉన్నారన్నది కాదు ముఖ్యం, క్రేజ్ ఎంత అన్నదే టాపిక్.

అక్కినేని ఫ్యామిలీ నుంచి చాలా మందే హీరోలుగా వచ్చినా, తక్కువ మందే స్టార్లుగా మారారు. నాగార్జున, చైతన్య మినహా మిగిలిన వారేవరు పెద్దగా రాణించలేదు. వీరిద్దరికి కూడా చాలా కాలమైంది హిట్ మూవీ లేక. సమంతతో విడిపోయిన తర్వాత ఫ్యామిలీ సమస్యను ఎదుర్కొంటున్నారు అక్కినేని నాగ చైతన్య. ఇక తండ్రి నాగర్జున పరిస్థితి మరింత దారుణంగా తయారు అయ్యింది. బిజినెస్ చేసుకుంటే బాగుటుందనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.

 

ఈ వరసలోనే అఖిల్, సుమంత్, సుశాంత్ ఇప్పటికీ స్టార్ డమ్ కోసం స్ట్రగుల్ ఎదుర్కొంటున్నారు. మెుత్తం అక్కినేని ఫ్యామిలీ హీరోలకే ఈ మధ్య కాలంలో గడ్డు పరిస్థితిని ఉన్నాయని చెప్పవచ్చు. నాగార్జున ‘ది ఘోస్ట్’ సినిమా తో నిరాశ పర్చగా, చైతూ ‘థాంక్యూ’ సినిమా ఫ్లాప్ అయిపోయింది. అఖిల్ అక్కినేని ‘ఏజెంట్’ మూవీ డిజాస్టర్ గా చెప్పవచ్చు.

 

ఈ సమయంలో అక్కినేని ఫ్యామిలీకే చెందిన హీరో సుశాంత్ మరియు సుమంత్ లు హీరో పాత్రలు మానేసి క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమాలు చేస్తున్నారు. సీతారామం సినిమాలో సుమంత్ కీలక పాత్రలో నటించి మెప్పించిన విషయం తెల్సిందే. ఆ తర్వాత వరుసగా సుమంత్ కి అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ఇక సుశాంత్ కూడా వరుసగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమాలు చేస్తున్న విషయం తెల్సిందే. వీరిద్దరు కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా వస్తున్నారు.

 

ఒక వైపు అక్కినేని హీరోలు నాగార్జున,నాగ చైతన్య మరియు అఖిల్ లు హీరోలుగా ఫ్లాప్స్ ను చవి చూస్తూ ఉంటే మరో వైపు హీరోలుగా అవకాశాలు రాకపోవడంతో సుమంత్ మరియు సుశాంత్ లు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా కొనసాగాల్సిందే అనే ప్రచారం జరుగుతోంది. ఏంటి రా ఇంత పరిస్థితి వచ్చిందని అక్కినేని ఫ్యామిలీకి అనే వార్తలు సోషల్ మీడియోలో గుప్పుమంటున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -