Viral: ఒకే చెట్టుకు ఏకంగా 300 రకాల మామిడి పండ్లు.. కానీ?

Viral: వేసవి వచ్చింది అంటే చాలు మనకు ఎక్కడ చూసినా కూడా మామిడి పండ్లు కనిపిస్తూ ఉంటాయి. మరి ముఖ్యంగా మనకు మార్కెట్లో చాలా రకాల మామిడి పండ్లు లభిస్తూ ఉంటాయి. బేనిస, బెంగళూరు,బంగినపల్లి, తోతాపురి, రసాలు ఇలా అనేక రకాల మామిడి పండ్లు లభిస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు మనం తెలుసుకోబోయే మామిడి చెట్టు గురించి తెలిస్తే మాత్రం షాక్ అవ్వడం ఖాయం. ఎందుకంటే మామూలుగా ఒక మామిడి చెట్టుకు ఒకటి లేదా రెండు రకాల కాయలు లేదంటే మూడు రకాల కాయడం అనేది సహజంగా చూస్తూ ఉంటాం.

కానీ ఒకే మామిడి చెట్టుకు దాదాపుగా 300 రకాల మామిడి పండ్లు పండితే ఆ చెట్టు ఊహించుకోవడానికి ఎంతో అద్భుతంగా ఉంటుంది కదూ. మరి ఆ 300 రకాల మామిడి పండ్లు కాసే చెట్టు ఎక్కడ ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన విషయం తెలిసిందే. లక్నో నగరంలో ప్రత్యేకంగా మాట్లాడుకునే మామిడి చెట్టు ఒకటి ఉంది. మామిడి చెట్టు యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఆ ఒక్క చెట్టుకు దాదాపు 300 రకాల మామిడి పండ్లు పండుతాయి. ఈ చెట్టు లక్నోకు కొన్ని కిలోమీటర్ల దూరంలో మలిహాబాద్ చౌక్ సమీపంలో ఉంది.

 

నగరానికి చెందిన హాజీ కలీం ఉల్లా ఖాన్ అనే వ్యక్తి ఎంతో శ్రమతో ఒక చెట్టుని కనుగొన్నాడు. ఈ చెట్టు గురించి రహస్యం గురించి తెలుసుకోవడానికి జపాన్ నుంచి ప్రత్యేక బృందం కూడా వచ్చింది. అయితే హాజీ కలీం సాహెబ్ 17 సంవత్సరాల వయసులో ఒక మొక్కను కనుగొన్నారు. ఆ మొక్క నుంచి దాదాపుగా ఏడు రకాల మామిడి పండ్లు పండించారు. మామిడి పండ్ల పై కృషి చేయడంతో అతనిని మ్యాంగో మ్యాన్ అని కూడా పిలుస్తారు. పండించిన వాటిని అమ్మకుండా ప్రజలకి పంచి పెడుతున్నారు. ఆ ప్రత్యేకమైన మామిడి చెట్టును చూడడానికి చాలామంది అక్కడికి తరలి వస్తూ ఉంటారు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ బ్యాలెట్ నంబర్ ఖరారు.. ఓటర్లు సులువుగానే ఓటు వేయొచ్చుగా!

Pawan Kalyan:  జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం బరిలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పేరు బ్యాలెట్ ఆర్డర్లో ఎక్కడ ఉందో జనసేన పార్టీ ఒక...
- Advertisement -
- Advertisement -