Tollywood: ఈ డిజాస్టర్ల వల్ల టాలీవుడ్ ఇండస్ట్రీ పరువు పోయిందని మీకు తెలుసా?

Tollywood: సాధారణంగా సినిమా ఇండస్ట్రీ అన్న తర్వాత జయపజయాలు రావడం సర్వసాధారణం. ఇలా ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి డిజాస్టర్ సినిమాలను ఎదుర్కొన్నటువంటి నిర్మాతలు ఉన్నారు. అయితే కొందరు నిర్మాతలు సినిమాలు ఫ్లాప్ కావడంతో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అనంతరం కొందరు ఇండస్ట్రీకి కూడా దూరమైనటువంటి సందర్భాలు ఉన్నాయి.

ఇలా కొన్ని సినిమాలు ఘోరంగా డిజాస్టర్ కావడమే కాకుండా ఇండస్ట్రీ పరువు కూడా తీసాయని చెప్పాలి. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన లైగర్ సినిమాకు ఆయనే నిర్మాత కావడం విశేషం. అదేవిధంగా ఈ సినిమా భారీ ధరలకు డిస్ట్రిబ్యూటర్లు కొనుగోలు చేయగా తీవ్రమైన నష్టాలు రావడంతో ఇప్పటికీ ఈ వివాదం కొనసాగుతూనే ఉంది. గత ఏడాది చిరంజీవి నటించిన ఆచార్య సినిమా విషయంలో కూడా ఇదే జరగడంతో ఇవన్నీ సెట్ చేయడానికి కొరటాలకు చాలా సమయమే పట్టిందని చెప్పాలి.

 

చిరంజీవి గతంలో నటించిన మృగరాజు తర్వాత నిర్మాత కె దేవీవరప్రసాద్ ఎక్కువ కాలం పరిశ్రమలో ఉండలేకపోయారు. బాలకృష్ణ హీరోగా నటించిన ఒక్క మగాడు ప్రభావంతో వైవిఎస్ చౌదరి మళ్ళీ అగ్ర హీరోలను కలుసుకోలేకపోయాడు. నాగార్జున రక్షకుడు సినిమా కూడా భారీ నష్టాలను ఎదుర్కొంది ప్రభాస్ రెబల్ సినిమా ద్వారా నిర్మాతలకు లారెన్స్ కు మధ్య వివాదాలు కూడా జరిగాయి.

 

ఎన్టీఆర్ హీరోగా నటించిన శక్తి సినిమా ద్వారా సుమారు 32 కోట్ల రూపాయలు నష్టపోయాను అని స్వయంగా అశ్వినీ దత్ పేర్కొన్నారు.మహేష్ బాబు నాని వల్ల అతని స్వంత అక్కయ్య మంజుల నష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది.అఖిల్ హీరోగా నటించిన ఏజెంట్ సినిమా ద్వారా అనిల్ కు భారీగా నష్టాలు వచ్చాయి. అయితే ఈయన నటించిన మొదటి చిత్రం అఖిల్ సినిమాకు నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి నిర్మాతగా వ్యవహరించు భారీ నష్టాలను ఎదుర్కొన్నారని చెప్పాలి.ఇలా ఈ హీరోలందరూ కూడా కొన్ని నాసిరకం కథలను ఎంపిక చేసుకొని ప్రేక్షకుల ముందుకు వస్తూ ఇలా డిజాస్టర్ లను ఎదుర్కోవడమే కాకుండా నిర్మాతలకు భారీ నష్టాలను మిగులుస్తున్నారని చెప్పాలి.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -