YSRCP: ట్విట్టర్ లో వైసీపీ సోషల్ మీడియా దూకుడు మామూలుగా లేదుగా!

YSRCP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో వైసీపీ ఇతర పార్టీల నేతలకు మైండ్ బ్లాంక్ అయ్యేలా ఫలితాలను సాధించిన సంగతి తెలిసిందే. 2019 ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి హామీని జగన్ నెరవేర్చిన నేపథ్యంలో 2024లో కూడా జగన్ సీఎం అని ప్రజలు ఫిక్స్ అయ్యారు. పథకాలు పొందుతున్న ప్రజలలో 95 శాతం మంది జగన్ కు అనుకూలంగా ఉన్నారు. అయితే వైసీపీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలు అయిన సంగతి తెలిసిందే.


కరోనా వల్ల, ఇతర కారణాలా వల్ల రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా జగన్ మాత్రం ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పాలన సాగిస్తున్నారు. సోషల్ మీడియాలో #ysrcpagain2024 అనే హ్యాష్ ట్యాగ్ తెగ వైరల్ అవుతోంది. భారీ సంఖ్యలో ట్వీట్లతో దేశంలోనే టాప్1 లో ఈ హ్యాష్ ట్యాగ్ వైరల్ అవుతుండటం గమనార్హం. జగన్ పై అభిమానుల్లో ఉన్న అభిమానానికి ఇంతకు మించి సాక్ష్యం అవసరం లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.

జగన్ రేంజ్ ఏంటో అభిమానులకు తెలిసేలా ట్విట్టర్ ను వైసీపీ సోషల్ మీడియా ఊపేస్తుండటం గమనార్హం. ప్రారంభ‌మైన ప‌ది నిమిషాల్లోనే హ్యాష్ ట్యాగ్ నంబర్1 స్థానంలో ట్రెండ్ కావడం వైసీపీ అభిమానులను మరింత సంతోషపెడుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ మధ్య కాలంలో వైసీపీ దూకుడు పెంచింది. సీఎం జగన్ పుట్టినరోజు సమయంలో కూడా వైసీపీ హ్యాష్ ట్యాగ్, జగన్ పేరుతో ఉన్న హ్యాష్ ట్యాగ్స్ ట్రెండింగ్ లో నిలిచాయి.

ఎన్ని పార్టీలు పొత్తులు పెట్టుకున్నా సీఎం జగన్ సింగిల్ గా ఎన్నికలకు వెళుతున్నారు. ఎన్నికల్లో అనుకూల ఫలితాలు సొంతం చేసుకోవడంతో పాటు వైసీపీ సంచలన విజయాలను సొంతం చేసుకునే ఛాన్స్ ఉంది. వైసీపీకి పేద, మధ్య తరగతి వర్గాల ఫుల్ సపోర్ట్ ఊహించని స్థాయిలో ఉంది. 2019 రికార్డులను జగన్ 2024లో తిరగరాయాలని వైసీపీ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -