Actress Bhanumathi: ఆ కారణంతోనే బాలయ్య సినిమాను ఒప్పుకోలేదా?

Actress Bhanumathi: తెలుగు ప్రేక్షకులకు నటి భానుమతి గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. అప్పటి టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. భానుమతి నటిగానే కాకుండా అప్పట్లో దర్శకురాలిగా, స్టూడియో అధినేత్రి, రచయితగా కూడా మంచి గుర్తింపు సంపాదించుకుంది.

అయితే ఈరోజు ఆమె పుట్టినరోజు సందర్భంగా ఆమెను మనం మరొకసారి గుర్తు తెచ్చుకుందాం. మల్లీశ్వరి, సారంగధర, విప్రనారాయణ, బొబ్బిలి యుద్ధం, మంగమ్మగారి మనవడు, పెళ్ళికానుక వంటి సినిమాలతో అద్భుతమైన విజయాలు సాధించింది. అంతేకాకుండా ఈ సినిమాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.

భానుమతి 13 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచే సంగీతం మీద కూడా చాలా ఇంట్రెస్ట్ చూపించేది. ఇక ఆమె నటన కెరీర్ కూడా అప్పటినుంచి స్టార్ట్ చేసింది. అప్పటి టాలీవుడ్ ఇండస్ట్రీలో సింగర్ గా కూడా ఒక మంచి గుర్తింపు తెచ్చుకుంది భానుమతి. అప్పట్లో ఆమె పాటలు విని ఇప్పటికీ ప్రేక్షకులు తనని గుర్తు తెచ్చుకుంటారు. భానుమతి ఎలాంటి పాత్ర పోషించిన కూడా ఒక సహజనటిగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

ఆమె సినిమా ఇండస్ట్రీలో దాదాపు 50 సంవత్సరాలు ఉన్నప్పటికీ.. ఆమె కేవలం 100 సినిమాల్లో మాత్రమే నటించింది. ఇక మంగమ్మగారి మనవడు సినిమాలో నందమూరి బాలకృష్ణ హీరోగా నటించాడు. ఈ సినిమా కథ చెప్పినప్పుడు భానుమతికి కొన్ని డైలాగులు నచ్చక ఈ సినిమా చేయడానికి ఒప్పుకోలేదట. నాతో ఈ డైలాగులు చెప్పిస్తే జనాలు ఎలా చూస్తారు. అసలు నేను ఎలా ఒప్పుకుంటాను అని అడిగిందట.

ఇక డైరెక్టర్ కోడి రామకృష్ణ ఏదో ఒక విధంగా భానుమతిని ఒప్పించాడట. అలా తెలుగు చిత్ర సినిమాలో భానుమతి ఎన్నో పాత్రలో నటించి నటిగా తనకంటూ చరగని ముద్ర వేసుకుంది. కేవలం నటిగానే కాకుండా దర్శకురాలిగా కూడా ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించింది భానుమతి.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -