YS Jagan: ఆడవాళ్లతో రాజకీయం చేస్తున్న జగన్.. ఓడిపోయినా పోయేది వాళ్ల పరువేనంటూ?

YS Jagan: వైసీపీ అధినేత జగన్ కు ఆడవారితో రాజకీయం రక్తికట్టించడం బాగా తెలుసు. ఆయన మొదటి నుంచి ఆడవారిని అడ్డం పెట్టుకొనే రాజకీయాలు చేస్తున్నారు. పార్టీ పెట్టినపుడు తన తల్లితో రాజకీయం మొదలు పెట్టారు. అంతకు ముందు ఆమెకు ఎలాంటి రాజకీయ అనుభవం లేదు. కొడుకు కోసం ఆమె రాజకీయాల్లోకి వచ్చారు. అయితే, ఆమె ఒక్కరే పార్టీని అధికారంలోకి తీసుకురావడం కష్టమని గ్రహించి చెల్లి షర్మిలను రంగంలోకి దించారు. జగన్ జైలుకు వెళ్లిపోయిన తర్వాత షర్మిల తన పాదయాత్రతో పార్టీ చచ్చిపోకుండా కాపాడారు. అయితే.. ఎన్ని చేసినా 2014 ఎన్నికల్లో వైసీపీ గెలవలేదు. 2019 ఎన్నికల నాటి వివేకా హత్య రూపంలో మరో ఇద్దరు మహిళలు జగన్ కు దొరికారు. అదే వివేకా కుమార్తె వైఎస్ సునీత, వివేకా భార్య సౌభాగ్యమ్మ. తన చెల్లికి తండ్రి లేకుండా చంద్రబాబు చేశారు.. తన చిన్నమ్మకు పసుపుకుంకుమ చెరిపేశారని గత ఎన్నికల ముందు ప్రచారం రక్తి కట్టించారు. ఎలాగోలా ఎన్నికల్లో గట్టెక్కి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ అసలు రంగు బయపడింది. అంతవరకూ ఆడవారితో రాజకీయం చేసే జగన్ ను మాత్రమే చూశాం.

2019 ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆ ఆడవారిని ఎలా వదిలించుకోవాలో కూడా చూడొచ్చు. ఇక ఏపీలో మీసేవలు చాలు.. వెళ్లి తెలంగాణలో రాజకీయం చేసుకోవాలని తల్లి చెల్లిని బలవంతంగా పార్టీ నుంచి పంపించేశారు. వివేకా హత్య జరిగిన సమయంలో మా చెల్లి, మా చిన్నమ్మ అని గగ్గోలు పెట్టిన జగన్.. ఎన్నికల తర్వాత.. తండ్రిని చంపిన కిరాతకురాలని సునీతపై ముద్రవేశారు. ఇలా జగన్ ఒక్కొక్కరిని వదిలించుకున్నారు. ఆ తర్వాత ప్రతిపక్ష నేతల ఇళ్లలో ఉండే మహిళలను కించ పరిచి విపక్షాలను వీక్ చేయాలని అనుకున్నారు. అందుకే… అసెంబ్లీని సైతం విపక్ష కూటమి నేతల ఇంట్లో మహిళలను దూషించడానికి వాడుకున్నారు. అలా చేసి ప్రతిపక్ష నేతలను మానశికంగా వేధించాలని జగన్ ప్లాన్.

ఇప్పుడు ఎన్నికల సమయంలో కూడా మహిళలతో రాజకీయాన్ని రక్తి కట్టించడానికి రెడీ అయ్యారు. 175 స్థానాల్లో చంద్రబాబు, పవన్ , బాలకృష్ణ, లోకేష్ పోటీ చేస్తున్న స్థానాలను జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. చంద్రబాబు పోటీ చేస్తున్న కుప్పంలో మంత్రి పెద్ది రెడ్డి దృష్టి పెట్టారు. మిగిలిన స్థానాల్లో జగన్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. పవన్, లోకేష్, బాలకృష్ణను ఓడించడానికి మహిళలను రంగంలోకి దింపారు.

మంగళగిరిలో లోకేష్ పై మురుగుడు లావణ్య పోటీ చేస్తున్నారు. హిందూపురంలో బాలకృష్ణ పై దీపికా పోటీలో ఉన్నారు. పిఠాపురంలో పవన్ పై వంగా గీత బరిలో ఉన్నారు. అయితే ఈ మూడు స్థానాల్లో పవన్ , బాలకృష్ణ, లోకేష్ గెలుపు ఖాయంగా తెలుస్తోంది. గెలిచి అసెంబ్లీ వెళ్తే.. మహిళపై గెలిచారని సెటైర్లు వేస్తారు. ఒకవేళ పొరపాటున ఓడిపోతే మహిళపై ఓడిపోయారు మీకెందుకు రాజకీయం అంటారు. ఈ స్ట్రాటజీతోనే 3 కీలకమైన స్థానాల్లో మహిళలను పోటి చేయిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Union Minister Piyush Goyal: వైఎస్సార్ ను సైతం ముంచేసిన సీఎం జగన్.. ఆ కేసులో కావాలనే ఇరికించారా?

Union Minister Piyush Goyal: వైయస్సార్ కాలనీ పట్ల కేంద్రమంత్రి పియూష్ గోయెల్ తన ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో పీయూష్ గోయల్ విలేకరులతో మాట్లాడుతూ జగన్ పాలనపట్ల విరుచుకుపడ్డారు. వైయస్సార్ కాంగ్రెస్...
- Advertisement -
- Advertisement -