Teja: ఆంధ్రుల ఆత్మగౌరవం తాకట్టు పెట్టారు.. తేజ షాకింగ్ కామెంట్స్!

Teja: టాలీవుడ్ ఇండస్ట్రీలో డైరెక్టర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న తేజ ప్రస్తుతం అహింస సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమా జూన్ రెండవ తేదీ ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్న తేజ తాజాగా ఆంధ్ర ప్రజల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ.. ఇప్పటికి మనకు పంజాబ్, కెనరా బ్యాంకులో కనబడుతుంటాయి. కానీ దాదాపు 90 సంవత్సరాలకు పైగా ఎన్నో సేవలు అందించిన ఆంధ్ర బ్యాంకు మాత్రం కనిపించదని తేజ తెలియజేశారు.స్వాతంత్ర సమరయోధుడు పట్టాభి సీతారామయ్య ఏర్పాటు చేసిన ఈ బ్యాంక్ 90 సంవత్సరాలు కు పైగా ప్రజలకు సేవలు అందించింది అయితే ఈ బ్యాంకును ఇందిరా గాంధీ జాతీయ బ్యాంకుగా ప్రకటించారు.

 

ఇలా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని ఎంతో సేవలు చేసినటువంటి ఆంధ్ర బ్యాంకు ను 2020వ సంవత్సరం ఏప్రిల్ ఒకటవ తేదీ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం చేశారు.ఇలా ఆంధ్రుల గౌరవానికి సూచికగా ఉన్నటువంటి ఆంధ్ర బ్యాంకును విలీనం చేస్తుంటే ఏ ఒక్క ఆంధ్రుడు కూడా ఈ బ్యాంకు విలీనాన్ని అడ్డుకోలేక పోయారు. ఈ విషయంలో ఆంధ్రులకు ఏమాత్రం ఆత్మాభిమానం లేదని తెలిపారు.

 

ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతుంటే సిగ్గులేకుండా చూస్తూ ఉన్నారని ఈ విషయంలో ఆంధ్ర ప్రజలకు ఏమాత్రం సిగ్గులేదు అంటూ ఈ సందర్భంగా తేజ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఆంధ్ర బ్యాంకు గురించి ఏపీ ప్రజలను ఉద్దేశిస్తూ ఈయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో తేజ గారు చేసిన వ్యాఖ్యలలో పూర్తిగా నిజం ఉందని మరికొందరు ఈయన వ్యాఖ్యలను సమర్థిస్తున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

AP Roads: ఏపీలో రోడ్ల పరిస్థితిని చూపించి ఓట్లు అడిగే దమ్ముందా.. వైసీపీ నేతల దగ్గర జవాబులున్నాయా?

AP Roads:  ఒక రాష్ట్రం అభివృద్ధి బాటలో నడవాలి అంటే ముందుగా ఆ రాష్ట్రంలో మౌలిక సదుపాయాలన్నీ కూడా సక్రమంగా ఉండాలి మౌలిక సదుపాయాలు అంటే రోడ్లు కరెంట్ నీరు వంటి వాటివి...
- Advertisement -
- Advertisement -