CM Jagan: జనం డబ్బుతో జగన్ కోసం బుల్లెట్ ప్రూఫ్ బస్సులు.. బస్సుల్లో తిరగని సీఎంకు ఈ బస్సులు అవసరమా?

CM Jagan: ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఒకచోట నుంచి మరొక చోటకు బస్సులలో ప్రయాణం చేయాలి అంటే ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. గుంతలు పడినటువంటి రోడ్లలో ఆర్టీసీలో ప్రయాణం చేయాలి అంటే సురక్షితంగా తమ గమ్యస్థానం చేరుకుంటామా లేదా అన్న సందేహాలు ప్రజలలో ఉన్నాయి. రోడ్లు బాగాలేని పరిస్థితి ఒకవైపు ఆ రోడ్లపై డొక్కు బస్సులను తిప్పుతూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇప్పటికే ఎన్నో బస్సులు మార్గమధ్యమంలోనే చక్రాలు ఊడిపోవడం స్టీరింగ్ విరిగిపోవడం పంట పొలాల్లోకి బస్సులు దూసుకుపోవడం వంటి సంఘటనలను మనం చూస్తూనే ఉన్నాము.

ఇలా ప్రజల ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్న ఇవేవీ ఏపీ సర్కారు కంటికి కనపడటం లేదని తెలుస్తుంది. ఇలా ప్రజలు ఎన్ని అవస్థలు పడుతున్న జగన్మోహన్ రెడ్డి మాత్రం తాను తిరగడానికి ఏకంగా కోట్లు విలువ చేసే నాన్ బుల్లెట్ ప్రూఫ్ బస్సులను తెప్పించారు. ఇప్పటికే సీఎం జగన్మోహన్ రెడ్డి కోసం రెండు బుల్లెట్ ప్రూఫ్ బస్సులు ఉన్నాయి. ఇవి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రచారం కోసం వాడుతున్నారు.

తాజాగా మరో మూడు కోట్ల రూపాయలను ఖర్చు చేసి మూడు నాలుగు బస్సులను కొనుగోలు చేశారు. ఇప్పటికే రెండు విజయవాడ ఆర్టీసీ డిపోకి రాగా ఈ వారంలోనే మరో బస్సు కూడా రాబోతుంది ఇలా ప్రజల సొమ్ముతో కోట్లు ఖర్చు చేసి తన స్వలాభం కోసం ఖరీదైన బస్సులను కొనుగోలు చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రజల రక్షణ మాత్రం గాలికి వదిలేసారు.

ఇక త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుంది అప్పటినుంచి పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్లినా కూడా హెలికాప్టర్ తప్పకుండా ఉండాల్సిందే సభ ప్రాంగణానికి ఈయన హెలిపాడ్ కేవలం కొన్ని వందల మీటర్ల దూరం మాత్రమే ఉంటుంది. ఈ వందల మీటర్ల దూరంకి ఇప్పుడు ఉన్నటువంటి బస్సులు ఉపయోగించుకోవచ్చు. కానీ ఈయన సరికొత్త బస్సులను కూడా తెప్పించడంతో ప్రజల సొమ్ము అంటే జగన్మోహన్ రెడ్డికి లెక్కలేదని ఈ విషయంపై ప్రతిపక్షాలు ఈయన పట్ల విమర్శలు చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -