Manchu Manoj: మంచు మనోజ్ కు ఆ హీరోయిన్ తో సీక్రెట్ మ్యారేజ్ జరిగిందా?

Manchu Manoj: ఒకప్పుడు మోహన్ బాబు కలెక్షన్ కింగ్ గా మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇండస్ట్రీలో కీలకమైన వ్యక్తిగా ఎదిగాడు. కానీ ఆయన నోటి దురుసు, ముక్కు సూటితనం వల్ల ఎక్కువగా ట్రోల్స్ కి గురవుతూ ఉంటారు. ఆయన పిల్లలు విష్ణు, లక్ష్మి కూడా వాళ్ల పిల్ల చేష్టలతో సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోల్స్ కి గురవుతూ ఉంటారు.

పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అంటూ విష్ణు మీడియా ద్వారా హెచ్చరించినా ట్రోల్స్ చేయడంలో ఎక్కడా తగ్గలేదు నెటిజెన్స్. మనోజ్ మాత్రం వీటికి అతీతంగా కనిపిస్తూ ఉంటాడు. ఆయన చేసే సినిమాలు ఆయన మనస్తత్వం సమాజంపై ఆయనకు ఉన్న అపారమైన ప్రేమ ఆయనను తెలుగు ప్రేక్షకులకు దగ్గర చేసింది. ఈ మధ్యనే ఆయన భూమా మౌనికను రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

 

గత కొద్ది కాలంగా వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే ఈ మధ్యనే మనోజ్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తను ట్రోల్ కి గురైన ఒక విషయం గురించి చెప్పుకొచ్చాడు. గతంలో మనోజ్ ఝుమ్మంది నాదం హీరోయిన్ తాప్సీ తో క్లోజ్ గా ఉండేవాడని వీళ్లిద్దరూ కలిసి పలు సందర్భాల్లో హైదరాబాద్ ప్రైవేట్ పార్టీలలో కెమెరాకు చిక్కారని కొన్ని రూమర్స్ ప్రచారం అయ్యాయి.

 

దాని గురించే మనోజ్ మాట్లాడుతూ నాకు గతంలో చాలామంది సోషల్ మీడియాలో తాప్సి తో బలవంతంగా పెళ్లి చేసేసారు. ఆ రూమర్స్ ని చూసి నేను తాప్సి చాలా నవ్వుకునే వాళ్ళం. నేను తాప్సీ కేవలం స్నేహితులమే మాత్రమే ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా కలిసిమెలిసి ఉంటాము. ఆమె తన మొదటి సినిమా ఝుమ్మంది నాదం నాతోనే చేసింది. అయినా ఒక అబ్బాయి అమ్మాయి కలిసి ఉంటే ప్రేమ పెళ్లి తప్ప మరొక ఆలోచన రాదా అంటూ నవ్వుతూనే నెటిజన్స్ మెత్తగా గడ్డి పెట్టాడు మనోజ్.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: జగన్ అధికారంలోకి వస్తే ఏపీ ప్రజల భూములు పోతాయా.. బాబు చెప్పిన విషయాలివే!

Chandrababu Naidu: జగన్ మరొకసారి అధికారంలోకి వస్తే ప్రజల భూములను అధికారికంగా కబ్జా చేస్తారని భయం ప్రజల్లో పట్టుకుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన భూ యాజమాన్య హక్కు చట్టం కబ్జాదారులకు అక్రమార్కులకు...
- Advertisement -
- Advertisement -