Pawan Kalyan: తెలుగు ఇండస్ట్రీ మొత్తం జనసేన వెంటే.. పవన్ ఆ ఒక్క మాటతోనే పడేశారుగా!

Pawan Kalyan: ఏపీలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. పొత్తు కుదరకుండా వైసీపీ ఎన్నిక కుట్రలు చేసినా.. ఓపిక్కా.. సహనంగా.. పొత్తు కుదిరేలా జనసేన అధినేత పవన్ తీవ్రంగా శ్రమించారు. చివరికి అనుకున్నది సాధించారు. పొత్తులో ఉన్న పార్టీలు దాదాపుగా అభ్యర్థులను ప్రకటించారు. ఇక మిగిలింది ప్రచారమే. ఈ నెల 31 నుంచి పవన్ వారాహి యాత్రను మళ్లీ మొదలు పెడుతున్నారు. ఎన్నికల దగ్గర పడటంతో సినిమా షూటింగులు కూడా పక్కన పెట్టేశారు. 2 నెలల క్రితం వరకు పవన్ తన షూటింగులు చేస్తూ పార్టీ వ్యవహారాలు, పొత్తు వ్యవహారాలు చేసేవారు. కానీ, ఇక ఎన్నికల వరకు ఏకంగా ప్రచారంలోనే ఉంటారు. పవన్ కు సినీ వర్గాల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. గతసారి సినిమా ఇండస్ట్రీ నుంచి ఎక్కువ మద్దతు వైసీపీకి లభించింది. దానికి కారణం అప్పుడు తెలంగాణలో కేసీఆర్ అధికారంలో ఉండటమే. చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని శపథం చేసిన కేసీఆర్.. సినిమా వాళ్ల నుంచి వైసీపీకి మద్దతు లభించేలా ఒత్తిడి చేశారు. ఎందుకంటే సినిమా వాళ్ల ఆస్తులు అన్ని హైదరాబాద్ లో ఉండటమే దీనికి కారణం. చివరికి చంద్రబాబుకు అత్యంత విశ్వసపాత్రుడుగా ఉండే మురళీ మోహన్ కూడా గత ఎన్నికల్లో పోటీ చేయకుండా.. తన కోడలను పోటీకి దించారు. కానీ.. ఈసారి సీన్ మారిపోయింది. సినిమా వాళ్లు నుంచి పెద్ద ఎత్తున పవన్ కు మద్దతు లభిస్తోంది.

ఇటీవల ఇండస్ట్రీ మొత్తం ఈసారి పవన్ కల్యాణ్ కే మద్దతు ఇస్తామని సీనియర్ హీరోయిన్ జయసుధ ప్రకటించారు. గత ఎన్నికల ముందు ఆమె వైసీపీలో చేరారు. లోటస్ పాండ్‌కు వెళ్లి మరీ జగన్ చేత వైసీపీ కండువా కప్పించుకున్నారు. కానీ, ఆ తర్వాత ఆమె పొలిటికల్‌గా సైలంట్‌గా ఉన్నారు. మళ్లీ ఎన్నికల సమయంలో తన మద్దతు పవన్‌కే అని ప్రకటించారు. అంతేకాదు సినిమా వాళ్లు మొత్తం పవన్ తోనే ఉంటారని చెప్పారు. రోడ్డుపైకి వచ్చి ప్రచారం చేయకపోయినా.. మా మద్దతు పవన్ కు ఉంటుందని భరోసా కల్పించారు. చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీలోకి వచ్చినా.. తక్కువ సమయంలో ఆయన ఓ గుర్తింపును తెచ్చుకున్నారని అన్నారు. సినిమాల్లో ఉంటే ఆయన భవిష్యత్ బంగారంలా ఉంటుందని అన్నారు. కానీ, ప్రజలకు ఏదో చేయాలనే రాజకీయాల్లోకి వచ్చారని పవన్ పై పొగడ్తల వర్షం కురిపించారు.

అంతేకాదు.. ఇటీవల మంచు మనోజ్ చేసిన కామెంట్స్ కూడా వైరల్ అయ్యాయి. ఓట్లు వేసేప్పుడు ఆలోచించి ఓట్లు వేయాలని ఆయన ప్రజలకు సూచించారు. సొంత కుటుంబానికే న్యాయం చేయలేని వ్యక్తి ప్రజలకు న్యాయం చేస్తాడా అని అన్నారు. అయితే ఆయన ఎవరి పేరు చెప్పకపోయినప్పటికీ.. జగన్ ను టార్గెట్ చేశారనే అర్థం అయింది. అంతేకాదు.. ప్రజల కోసం ప్రశ్నించే వ్యక్తికి, డబ్బు మీద ఆశ లేని వ్యక్తికి ఓటు వేయండని సూచించారు. దీంతో.. మంచు మనోజ్ పవన్ కే మద్దతు ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో మోహన్ బాబు వైసీపీకి అనుకూల వైఖరి తీసుకున్నారు. చంద్రబాబు తన కాలేజీ పిల్లలకు ఫీజ్ రియంబర్స్ మెంట్ చెల్లించలేదని నిరాహార దీక్ష చేసి.. టీడీపీ చేయాల్సినంత నష్టం చేశారు. కానీ, ఇప్పుడు సీన్ మారింది. ఈ కోవలోకే ఇప్పుడు యాంకర్ అనసూయ కూడా తన మద్దతు జనసేనకే అని అన్నారు. ఓ ఇంటర్యూలో ఆమె ఈ రకంగా స్పందించారు. అవకాశం ఉంటే పవన్ కోసం ప్రచారం కూడా చేస్తానని చెప్పారు.

చంద్రబాబు అరెస్ట్ తర్వాత పవన్ చేసిన కామెంట్స్ సినిమా వాళ్లను ఆకట్టుకున్నాయి. అప్పటి నుంచి సినిమా వాళ్లు పవన్ కు మద్దతు పలుకుతున్నారు. చంద్రబాబు అరెస్ట్ పై ఇండస్ట్రీ వాళ్లు ఎందుకు స్పందించలేదని మీడియా వాళ్లు అడిగిన ప్రశ్నలకు పవన్ సమాధానం చాలా వ్యూహాత్మంగా ఉంది. చంద్రబాబు అరెస్ట్ ను తప్పుపడితే వైసీపీ నేతల దాడులను ఎదుర్కోవాల్సి వస్తుందని సినిమా వాళ్లు సైలంట్ గా ఉన్నారు. రజనీకాంత్ లాంటి వారినే నోటికొచ్చినట్టు మాట్లాడిన వైసీపీ వాళ్లు మన వాళ్లను వదులుతారా? అని అన్నారు. వైసీపీ వాళ్ల నోట్లో పడాలని అని ఎవరూ కోరుకోరు కదా? అంటూ ఇండస్ట్రీ వాళ్లకు సపోర్ట్ చేశారు. అప్పటి నుంచి పవన్ కు చాలా మంది మద్దతిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

KCR-Jagan: జగన్ కోసం కేసీఆర్ తాపత్రయం వెనుక అసలు లెక్కలివే.. ఓడితే మునిగినట్టేనా?

KCR-Jagan: ఆంధ్రప్రదేశ్లో జరగబోయే ఎన్నికల విషయంలో తెలంగాణలో సైతం పెద్ద ఎత్తున హడావిడి ఆసక్తి నెలకొందని చెప్పాలి. ఈ క్రమంలోనే ఏపీ ఎన్నికల గురించి ఇటీవల బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ మాట్లాడుతూ చేసిన...
- Advertisement -
- Advertisement -