Thaman: థమన్ ను త్రివిక్రమ్ ఇంత దారుణంగా అవమానించారా?

Thaman: ఎప్పుడెప్పుడు అప్డేట్లు వస్తాయా అని ఎదురుచూస్తున్నా సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ కి వరుస అప్డేట్లతో పండగ వాతావరణం ఏర్పడింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నిర్మిస్తున్న ఎస్ఎస్ఎంబి 28 సినిమాకి ఈ మధ్యనే అప్డేట్లు రావడం ప్రారంభమయ్యాయి. ఈ నెల 31న టైటిల్ రిలీజ్ చేస్తామంటూ ఒక పోస్టర్ విడుదల చేశారు. ఆ పోస్టర్లలో కానీ అనౌన్స్మెంట్ వీడియోలలో కానీ మ్యూజిక్ డైరెక్టర్గా తమన్ పేరు కనబడకపోవడం అనుమానస్పదమైన విషయం.

పోస్టర్ల మీద దర్శకుడు పేరు, నిర్మాత పేరుతో పాటు మ్యూజిక్ డైరెక్టర్ పేరు కూడా ఉండాలి కానీ మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ పేరు లేకపోవడంతో ప్రేక్షకులు అనుమానానికి గురవుతున్నారు. కిందటిసారి సర్కారు వారి పాట సినిమాలో అవకాశం ఇచ్చినా సరే యావరేజ్ ఆల్బమ్ నే కంపోజ్ చేశారు రెండోసారి అవకాశం ఇచ్చినా సరిగ్గా వాడుకోవడం లేదు అని తమన్ మీద మహేష్ బాబు అసంతృప్తి పడ్డారని అందుకే తమన్ ని తొలగించి కొత్త మ్యూజిక్ డైరెక్టర్ని పెట్టుకోవాలనుకుంటున్నారని వార్తలు వినపడుతున్నాయి.

 

ఇదేగాని నిజమైతే తమన్ కి ఇంతకుమించిన అవమానం ఉంటుందా? పైగా ఇప్పటికిప్పుడు కొత్త మ్యూజిక్ డైరెక్టర్ని పెట్టడం అంటే మాటలు కాదు. అనిరుద్ రావిచందర్ ప్రాజెక్టుల మీద ప్రాజెక్టులతో బిజీగా ఉండగా డి.ఎస్.పి సరైన ఫార్మ్ లో లేడు. జీ.వి ప్రకాష్ కుమార్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్లను వెతుక్కుంటే పని అవ్వచ్చు. అయినా ఈ నెల 31న సినిమా టైటిల్ విడుదల అయ్యేంత వరకు సినిమాలో తమన్ ఉన్నాడో లేదో చెప్పలేము. వీటన్నిటికీ సమాధానం ఆ రోజే దొరుకుతుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -