Karate Kalyani: ఎన్టీఆర్ విగ్రహంపై కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్.. ఏమన్నారంటే?

Karate Kalyani: ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న హీరో కరాటే కళ్యాణి. గత కొద్దిరోజులుగా ఈ పేరు సోషల్ మీడియాలో మారుమోగుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. కాగా తాజాగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కళ్యాణిని సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ విషయం గురించి ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. కాగా ఈ విషయంలో కొందరు ఆమెకు మద్దతుగా కామెంట్స్ చేస్తుండగా ఇంకొదరు మాత్రం ఆమెపై నెగిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు. అయితే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మాత్రం ఈ వివాదం గురించి రియాక్ట్ కావడానికి ఇష్టపడటం లేదు.

ఈ వివాదం గురించి స్పందిస్తే వివాదం మరింత పెద్దది అయ్యే అవకాశం ఉంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా సోమాజి గూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమయంలో యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు, సభ్యులు మాట్లాడుతూ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కరాటే కళ్యాణిని సస్పెండ్ చేయడం చాలా దారుణం అని, భగవంతునికి మానవరూపం ఇవ్వరాదని ఒక ఆడబిడ్డ పోరాటం చేస్తే సస్పెండ్ చేయడం సరికాదన అభిప్రాయం వ్యక్తం చేశారు. కరాటే కళ్యాణిని సస్పెండ్ చేయడం ద్వారా సినిమా పరిశ్రమ ఒక వర్గానికి చెందిందని అర్థం అవుతోందని వాళ్లు తెలిపారు.

 

సస్పెన్షన్ ను వెనక్కు తీసుకోకపోతే హైదరాబాద్ లో ఉన్న 20 లక్షల మంది యాదవులు ఒక్కటై పోరాటం చేస్తామని వాళ్లు వెల్లడించారు. ఆ తర్వాత కరాటే కళ్యాణి మాట్లాడుతూ తాను సీనియర్ ఎన్టీఆర్ ను ఎప్పుడూ కించపరచలేదని వెల్లడించారు. తాను కూడా సీనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ అని ఆమె చెప్పుకొచ్చారు. కృష్ణుని రూపంలో ఎన్టీఆర్ అనే కాకుండా ఎవరు పెట్టినా ఊరుకునేది లేదని ఆమె తెలిపారు. మొత్తానికి కరెక్టే కళ్యాణి సస్పెండ్ వేటు వ్యవహారం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -