YSR-NTR: పథకాలను నమ్మితే నిండా మునిగినట్టే.. పన్నులు భారీగా పెరగనున్నాయా?

YSR-NTR: ప్రస్తుత కాలంలో రాజకీయాలు రాజకీయంగానే మిగిలిపోతున్నాయి. రాజకీయాలు అంటే రాష్ట్ర అభివృద్ధి ప్రజల సంక్షేమం దృష్టిలో పెట్టుకొని రాష్ట్రాన్ని ముందుకు నడిపించే నాయకులు కావాలి కానీ ప్రస్తుత కాలంలో రాజకీయ నాయకులు తమ సామాజిక వర్గానికి మాత్రమే లబ్ధి చేకూరాలని తమ జేబులు మాత్రమే నిండాలన్న రీతిలో వ్యవహరిస్తున్నారు.ఈ క్రమంలోనే అధికారంలోకి రావడం కోసం పెద్ద ఎత్తున ఒక పార్టీని మించి మరొక పార్టీ ప్రజలకు వరాలు ఇస్తున్నారు.

ఇప్పటికే జగన్ సర్కార్ ఎన్నో సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు పెద్ద ఎత్తున డబ్బును ఇస్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే జగన్మోహన్ రెడ్డిని మించి చంద్రబాబు నాయుడు ప్రజలకు సంక్షేమ ఫలాలు ఇవ్వడం కోసం తన మేనిఫెస్టోని ప్రకటిస్తున్నారు. ఇలా జగన్ 13 వేల రూపాయల అమ్మబడి ఇస్తే చంద్రబాబు నాయుడు 15000 ఇస్తానని తెలిపారు రైతు భరోసా జగన్ 7000 ఇస్తే చంద్రబాబు నాయుడు 20,000 ఇస్తానని ప్రకటిస్తున్నారు.

 

ఇప్పటికే జగన్ సర్కార్ ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలకు రెట్టింపు డబ్బుతో సంక్షేమ పథకాలను అందిస్తానని చంద్రబాబు నాయుడు తెలియచేస్తున్నారు. ఇలా పెద్ద ఎత్తున సంక్షేమ ఫలాలను అందించడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయన్న ప్రశ్న సామాన్య ప్రజలలో కూడా తలెత్తుతుంది.ప్రజలకు ఇన్ని సంక్షేమ పథకాలు అందించాలి అంటే ప్రభుత్వ ఖజానాలో అంత డబ్బు లేదు కనుక ఈ సంక్షేమ పథకాలను అందించాలి అంటే ప్రజల నుంచి పన్నుల రూపంలో డబ్బు రాబట్టాలి.

 

ఇలా సంక్షేమ పథకాల పేరిట ప్రజలపై పెద్ద ఎత్తున పన్ను భారం పడబోతుందని ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేస్తున్నారు. ఇలా సంక్షేమ పథకాలను అతిగా ప్రకటించడం వల్ల మొదటికే మోసం వస్తుందని మరికొందరు ఈ మేనిఫెస్టో ల గురించి చర్చలు జరుపుతున్నారు.ఇక రాష్ట్రాన్ని ముందుకు నడిపించడంలో రాజశేఖర్ రెడ్డి ఎన్టీఆర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్లాలని పలువురు చెబుతున్నారు. మీరు కూడా రెండు రూపాయలకు కిలో బియ్యం తీసుకువచ్చారు. రాజశేఖర్ రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ అంటూ కొన్ని పథకాలను తీసుకువచ్చారు. ఇంతకుమించి ఎలాంటి ఉచిత పథకాలను ప్రజలకు అందించలేదు ఇలా ఉచిత పథకాలను అందించకపోయిన ఈ ఇద్దరి రాజకీయ నాయకులు ప్రజాధరణ పొందలేదా అని ప్రశ్నిస్తున్నారు. ఇలా ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా సంక్షేమ ఫలాలను అందిస్తూ పోతే మొదటికే మోసం వస్తుందని నిపుణులు వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -