Mahesh: మహేష్ కు ఈ మాత్రం తెలివి లేదా.. ఇంత తెలివి తక్కువగా చేయాలా?

Mahesh: టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో గుంటూరు కారం సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా పూర్తి కావాల్సి ఉండగా పలు కారణాల వల్ల వాయిదా పడుతూనే వస్తోంది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ఘట్టమనేని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ అలాగే గ్లింప్స్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే.

ఈ సినిమాకు గుంటూరు కారం అనే మాస్ టైటిల్ ని ప్రకటించారు చిత్ర యూనిట్. రిలీజ్ చేసిన గ్లింప్స్ కూడా ఫుల్ మాస్ గా ఉండటంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. కాగా తాజాగా విడుదల చేసిన ఈ సినిమా టైటిల్ కింద ట్యాగ్ లైన్ హైలీ ఇన్‌ఫ్లేమబుల్ అని ఇచ్చారు. అంటే ఎక్కువ ఘాటు, ఎక్కువ మంట ఉంది అని అర్ధం. అయితే మహేష్ టైటిల్ కి ఈ ట్యాగ్ చూశాక ఎన్టీఆర్ రాఖీ సినిమా వైరల్ గా మారింది. కృష్ణవంశీ దర్శకత్వంలో ఎన్టీఆర్, ఇలియానా, ఛార్మి లు నటించిన రాఖీ సినిమా కమర్షియల్ గా హిట్ అవ్వకపోయినా విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంది. అయితే రాఖీ సినిమాకు కూడా ట్యాగ్ హైలీ ఇన్‌ఫ్లేమబుల్ అని ఉంటుంది.

 

దీంతో ఈ రెండు సినిమాల టైటిల్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. ఆల్రెడీ రాఖీ సినిమాకు ఈ ట్యాగ్ ఉందని తెలిసే గుంటూరు కారం సినిమాకు పెట్టారా? లేకపోతే చేసుకోలేదా? లేక ఈ సినిమాకు కూడా ఆ ట్యాగ్ సెట్ అవుతుందని పెట్టారా అని నెటిజన్లు, అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ ట్యాగ్ పై చిత్రయూనిట్ ఎవరైనా స్పందిస్తారేమో చూడాలి. కొంతమంది నెటిజన్స్ ఈ విషయంపై మహేష్ బాబుకి బుద్ధి లేదా ఎన్టీఆర్ టైటిల్ ని కాపీ కొట్టాడుగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -