Balayya: పవన్ కొరకు బాలయ్య చేసిన త్యాగం తెలిస్తే మాత్రం దండం పెట్టాల్సిందే!

Balayya: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే హీరోల మధ్య ఎంతో మంచి సాన్నిహిత్యం ఉంటుంది.ఒక హీరో సినిమాకి మరొక హీరో సహాయం చేసుకోవడం వంటివి చేస్తూ వారి పట్ల ఉన్నటువంటి అభిమానాన్ని చాటుకుంటూ ఉంటారు. ఇలా హీరోలు ఎంతో సాన్నిహితంగా ఉన్నప్పటికీ అభిమానులు మాత్రం పెద్ద ఎత్తున గొడవ పడుతూ ఉంటారు.ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి ఏమాత్రం పడటం లేదు అన్న వార్తలు కూడా వినపడుతూ ఉంటాయి.

ఈమధ్య కాలంలో ఇలాంటి వార్తలకు బాలయ్య పూర్తిగా చెక్ పెట్టేశారు.. బాలకృష్ణ వ్యాఖ్యాతగా ఆహలో ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. అయితే ఈ కార్యక్రమంలో ఈయన మెగా హీరోలను కూడా ఆహ్వానించి ప్రశ్నించిన విషయం మనకు తెలిసిందే.అలాగే బయట ఫంక్షన్లలో కూడా మెగా హీరోలతో కలిసి బాలయ్య సందడి చేస్తున్నారు. ఇలా వీరిద్దరి మధ్య ఎలాంటి శత్రుత్వం లేదని కేవలం మితృత్వం మాత్రమే ఉందంటూ చాటి చెబుతున్నారు.

 

ఇక బాలకృష్ణ పవన్ కళ్యాణ్ కోసం ఏ హీరో కూడా చేయని త్యాగం చేశారని చెప్పాలి. పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా అవకాశం ముందుగా బాలకృష్ణకు వచ్చింది. అయితే కథ మొత్తం విన్నటువంటి బాలయ్య ఈ సినిమాకు పవన్ కళ్యాణ్ అయితే సరిగ్గా సరిపోతారని పవన్ కళ్యాణ్ పేరును సూచించారట.ఇలా బాలయ్య చెప్పడంతో ఈ సినిమా కథ పవన్ వద్దకు వెళ్లడం సినిమాలో పవన్ నటించిన మంచి సక్సెస్ అందుకోవడం జరిగింది.

 

ఇక ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ ఓ సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా టైటిల్ కింద బ్రో ఐ డోంట్ కేర్ క్యాప్షన్ పెట్టాలని భావించారట కానీ నటుడు సముద్ర ఖని దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ సాయి ధరంతేజ్ నటిస్తున్నటువంటి సినిమాకి బ్రో అనే టైటిల్ అనుకుంటున్నారని భావించడంతో బాలకృష్ణ తన సినిమాకు పెట్టాలనుకున్నటువంటి క్యాప్షన్ త్యాగం చేశారని తెలుస్తుంది. ఇలా పవన్ కళ్యాణ్ కోసం బాలయ్య తన సినిమా టైటిల్ త్యాగం చేశారని తెలిసి బాలయ్య మంచితనంపై పవన్ అభిమానుల సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -