BJP Romance: ఊసరవెల్లి కంటే బీజేపీ దారుణమా.. అన్ని పార్టీలు దగ్గరి వాళ్లేనా?

BJP Romance: సాధారణంగా ఒక వ్యక్తి ఇద్దరు ముగ్గురితో ప్రేమ ప్రయాణాలు చేయడం బహుశా మనం సినిమాలలోనే చూసే ఉంటాము. కానీ ఇలాంటి కహానీలు రాజకీయాలలో కూడా చూడవచ్చని తాజాగా కేంద్ర ప్రభుత్వ వ్యవహారం చూస్తుంటే అర్థమవుతుంది. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ సర్కార్ ఆంధ్రప్రదేశ్లో టిడిపి పార్టీతో పాటు వైఎస్ఆర్సిపి జనసేన పార్టీతో చాలా సన్నిహితంగా ఉండడం చూస్తుంటే బిజెపి ఈ మూడు పార్టీలతో రొమాన్స్ చేస్తుందన్న సందేహాలు తలెత్తుతున్నాయి.

2018 సార్వత్రిక ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు బీజేపీ ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. మోడీ అంత చూసేవరకు తాను నిద్రపోనంటూ శపదాలు చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం ఏపీకి పాచిపోయిన లడ్డులు ఇచ్చారు అంటూ బిజెపి పై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు.వైఎస్ఆర్సిపి పార్టీ నేత జగన్మోహన్ రెడ్డి మాత్రం బిజెపి పై ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేసినది కేవలం చంద్రబాబు నాయుడుని పవన్ కళ్యాణ్ ని మాత్రమేనని తనకు తెలుసు.

 

2019 సార్వత్రిక ఎన్నికలు జరిగిన తర్వాత ఊహించని స్థాయిలో వైఎస్ఆర్సిపి పార్టీ గెలుపొందడం డిపాజిట్లు కూడా తెలుగుదేశం పార్టీ కోల్పోవడంతో ఒక్కసారిగా అందరూ సైలెంట్ అయ్యారు. ఆ వెంటనే పవన్ కళ్యాణ్ వెళ్లి బిజెపితో పొత్తుకు సిద్ధమయ్యారు. చంద్రబాబు నాయుడు కూడా ప్రస్తుతం వచ్చే ఎన్నికలలో గెలుపొందడం కోసం బిజెపితో పొత్తుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. బిజెపి ప్రభుత్వం పొత్తు ఇవ్వకపోయినా పర్వాలేదు తనతో శత్రుత్వం లేకపోతే మంచిదన్న ఉద్దేశంతో బిజెపితో చేతులు కలపడానికి సిద్ధమవుతోంది.

 

ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు తాజాగా బిజెపి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ను కలవడంతో బిజెపి వ్యవహారం చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ లోని మూడు ప్రాంతీయ పార్టీలతోనూ సన్నిహితంగా ఉంటుందని పలువురు ఈ వ్యవహారంపై స్పందించి ఈ మూడు పార్టీలతో బిజెపి రొమాన్స్ చేస్తుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి బిజెపితో చంద్రబాబు నాయుడు పొత్తు కుదుర్చుకొని జగన్ పై దాడికి సిద్ధమవుతున్నారా లేదా అనేది తెలియాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -