Coromandel Express: ఈ కొడుకుకు చిన్న వయస్సులో ఎంత కష్టమో.. తల్లి మరణించడంతో?

Coromandel Express: ఒడిశా రైలు ప్రమాద ఘటన ఎన్నో కుటుంబాలలో తీవ్ర విషాదాన్ని నింపిందని చెప్పాలి. ఎన్నో ప్రాంతాలకు చెందిన వారందరూ తమ గమ్యస్థానాన్ని చేరుకోవడం కోసం కోరమండల్ ఎక్స్ప్రెస్ రైలులో ప్రయాణం మొదలుపెట్టారు అయితే వారు మాత్రం వారి గమ్య స్థానాన్ని చేరుకోక ముందే అనంతవాయువులలో కలిసిపోయారు. కోరమండల్ ఎక్స్ప్రెస్ ప్రమాదానికి గురి కావడంతో కొన్ని వందల మంది ప్రాణాలు కోల్పోగా వేల సంఖ్యలో ప్రయాణికులు గాయాల పాలయ్యారు.

ఫలానా ట్రైన్ లో ఇంటికి వస్తున్నాం అంటూ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెప్పిన ప్రయాణికులు ఇంటికి చేరుకోక ఇలాంటి ప్రమాదానికి గురయ్యారని తెలియడంతో వెంటనే కుటుంబ సభ్యులు హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకొని తమ వారు ఎక్కడ ఉన్నారు అని పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే ఒరిస్సాకు చెందిన సూర్యవీర్ తల్లి, అమ్మమ్మ కోరమండల్ ఎక్స్ ప్రెస్ ఎక్కారు. 170 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిటీకి వెళ్లి, వైద్య పరీక్షలు చేయించుకొని మందులు తెచ్చుకోవాలనుకున్నారు.

 

ఇలా మీరు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని తెలియడంతో హుటాహుటిన సూర్యవీర్ సంఘటన స్థలానికి వెళ్లి తన అమ్మమ్మ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇలా వారి కోసం వెతుకుతూ ఉండగా సూర్య వీర్ కి అమ్మమ్మ కనిపించడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు.అమ్మమ్మ బ్రతికే ఉంది కాబట్టి అమ్మ కూడా ఎక్కడో ఒకచోట బ్రతికే ఉంటుందన్న ఆశతో తన తల్లి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

 

ఈ క్రమంలోనే రైలు ఎక్కే సమయంలో తన తల్లి ఎలాంటి రంగు చీర కట్టుకొని ఉంది అనే విషయాన్ని సోషల్ మీడియాలో తెలియచేస్తూ తన తల్లి ఫోటోని కూడా షేర్ చేస్తూ ఆచూకీ తెలిసినవారు సమాచారం ఇవ్వాలని కోరారు.ఇలా ఒక వైపు సోషల్ మీడియా వేదికగా తన తల్లి జాడ గురించి వెతుకుతూనే సంఘటన స్థలంలో కూడా తల్లి కోసం చర్యలు చేపట్టారు. అయితే తన తల్లి ఈ ప్రమాదంలో మరణించిందని ఆమె మృతదేహం ఫోటోని ఒక యువకుడు వాట్సప్ ద్వారా తనకు పంపించారు. రైలు పట్టాలపై విగత జీవిగా పడి ఉన్నటువంటి తన తల్లిని చూసి సూర్యవీర్ ఎంతో కుమిలిపోయాడు. అయితే వాట్సప్ యూజర్ పంపిన అడ్రస్ వద్దకు వెళ్లి తన తల్లిని స్వగ్రామానికి తీసుకెళ్లాలని ప్రయత్నం చేయగా అక్కడ తన తల్లి మృతదేహం కనిపించకపోవడంతో ఆ కొడుకు బాధ వర్ణాతీతం అని చెప్పాలి.

 

 

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -