Coromandel Express: కోరమాండల్ ఎక్స్ ప్రెస్ చరిత్ర ఇదే.. ఈ ట్రైన్ ఎంత గ్రేట్ అంటే?

Coromandel Express: శుక్రవారం సాయంత్రం ఒడిస్సాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 300 మందికి పైగా ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. వేల సంఖ్యలో ప్రయాణికులు గాయాల పాలయ్యారు.కేవలం సిగ్నల్స్ తప్పిదం కారణంగానే రైల్వే ట్రాక్ పై ఆగి ఉన్నటువంటి గూడ్స్ రైలును కోరమండల్ ఎక్స్ప్రెస్ ఢీ కొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే యశ్వంతపూర్ సూపర్ ఫాస్ట్ రైలు అదే మార్గంలో రావడంతో ఆ రైలు కోరమండల్ రైలును ఢీకొనడంతో మరింత ప్రమాదం చోటుచేసుకుంది.

ఇలా ఈ రైలు ఘటనలో ఎంతో మంది మరణించడం వేల సంఖ్యలో ప్రయాణికులు గాయాలు పాలు కావడంతో ఎంతోమంది ఈ ఘటనపై తీవ్రస్థాయిలో దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఇలా ప్రమాదానికి గురైన కోరమండల్ ఎక్స్ప్రెస్ గురించి పెద్ద ఎత్తున గూగుల్లో సెర్చ్ చేస్తూ కోరమండల్ ఎక్స్ప్రెస్ ప్రత్యేకతలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ప్రత్యేకతలు ఏంటి అనే విషయాన్ని వస్తే…

 

భారతీయ రైల్వేలో కోరమాండల్ రైలు పట్టాలు ఎక్కి 46 సంవత్సరాలు అవుతుంది దేశంలోని మొట్టమొదటి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలుగా కోర మండల్ పేరు సంపాదించుకుంది.ఈ రైలు ప్రారంభించిన మొదట్లో కేవలం వారానికి రెండుసార్లు మాత్రమే ప్రయాణం చేసే అయితే ప్రస్తుతం ప్రయాణికులను దృష్టిలో పెట్టుకొని రోజు ఈ రైలు నడుస్తోంది. చెన్నై నుంచి పశ్చిమ బెంగాల్ లోని హౌరాకు వెళ్తుంది. సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తుంది.

 

చెన్నై నుంచి హౌరా వరకు 25 గంటల్లో 16,61 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఈ రైలు చెన్నైలో స్టార్ట్ అయ్యి నాన్ స్టాప్ గా 6 గంటల్లోనే విజయవాడకు చేరుకుంటుంది. సౌత్ ఈస్ట్ ఈస్టర్న్ రైల్వేలో కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ను రారాజుగా పిలుస్తారు.అయితే ఈ కోరమాండల్ ఎక్స్ప్రెస్ కు గతంలో కూడా చాలా ప్రమాదాలు జరిగాయి కానీ ఒడిశాలో జరిగినటువంటి ఘోర ప్రమాదం ఇప్పటివరకు ఎక్కడ జరగలేదని చెప్పాలి.

 

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -