Young Tiger Fans: ఊరమాస్ వార్నింగ్ ఇచ్చిన యంగ్ టైగర్ ఫ్యాన్స్.. ఏం జరిగిందంటే?

Young Tiger Fans: RRR సినిమా ద్వారా గ్లోబల్ స్టార్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఎన్టీఆర్ తన తదుపరి సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ కి బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అవకాశాలు వస్తున్నాయి. ఇలా వరుస సినిమాలతో ఎన్టీఆర్ ఎంతో బిజీగా గడుపుతున్నారని చెప్పాలి. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.

ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నారు. అదేవిధంగా బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ నటిస్తున్నటువంటి వార్ 2 సినిమాలో కూడా ఎన్టీఆర్ కీలకపాత్రలో నటించబోతున్నారని తెలుస్తోంది.త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పనులు కూడా ప్రారంభం కాబోతున్నాయని సమాచారం. అయితే ఈ విషయం గురించి ఇంకా అధికారిక ప్రకటన చేయకపోయినా హృతిక్ రోషన్ మాత్రం పరోక్షంగా ఈ సినిమాలో ఎన్టీఆర్ నటిస్తున్నారని తెలియజేశారు.

 

ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా హృతిక్ రోషన్ సోషల్ మీడియా వేదికగా ఎన్టీఆర్ కి శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా యుద్దభూమిలో నీకోసమే ఎదురు చూస్తున్నాను మిత్రమా అంటూ శుభాకాంక్షలు తెలియజేయడంతో వార్ 2 సినిమాలో ఎన్టీఆర్ నటిస్తున్నారని అందరికీ కన్ఫామ్ అయ్యింది. హృతిక్ స్టార్ హీరో అన్న విషయం మనకు తెలిసిందే.అయితే ఈ హీరోని హైలెట్ చేస్తూ ఎన్టీఆర్ కి స్పెషల్ అపియరెన్స్ ఇస్తే సినిమా పోవడం ఖాయమని పలువురు భావిస్తున్నారు.

 

ఈ సినిమాలో హృతిక్ రోషన్ పాత్రకు సమానంగా ఎన్టీఆర్ పాత్ర ఉంటేనే సినిమా మరో లెవెల్ లో ఉండబోతుందని అలా కాకుండా ఎన్టీఆర్ పాత్ర నిడివి ఏ మాత్రం తగ్గించినా సినిమా రిజల్ట్ తేడా కొడుతుందని చెప్పాలి. అంతేకాకుండా ఎన్టీఆర్ యాంటీ ఫ్యాన్స్ నుంచి భారీ విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది కనుక ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్టీఆర్ పాత్ర కూడా హృతిక్ రోషన్ పాత్రకు సమానంగా ఉండాలని, తేడాలు వస్తే మామూలుగా ఉండదు అంటూ పరోక్షంగా ఈ సినిమాపై ఎన్టీఆర్ అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -