Adipurush: ఆ విధంగా రికార్డ్ సృష్టించిన ఆదిపురుష్.. ఎంత ఖర్చైందంటే?

Adipurush: ఆదిపురుష్ ప్రీ రిలీజ్ఈవెంట్ మంగళవారం సాయంత్రం తిరుపతిలో ఎంతో ఘనంగా జరిగిన విషయం మనకు తెలిసిందే. రామాయణ ఇతి హాసం నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా జూన్ 16వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే తిరుపతిలో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు.

ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థలు అయినటువంటి యువి సంస్థ, పీపుల్స్ మీడియా, శ్రేయాస్ మీడియా ఈ మూడు సంస్థలకు చెందిన సిబ్బంది వారం రోజులు శ్రమిస్తే ఈ సభ ఈ విధంగా జరిగింది. ఇలా ఈ మూడు సంస్థలకు చెందినటువంటి 100 మంది వారం రోజుల పాటు తిరుపతిలో మఖం వేసి ఈ వేడుకను ఎంతో విజయవంతంగా నిర్వహించాలని తెలుస్తుంది. ఏ సినిమా వేడుకకు రానీ విధంగా ఈ సినిమా వేడుకకు లక్ష మంది అభిమానులకు ఎంట్రీ పాస్ ఇచ్చారు.

 

అలాగే ముంబై నుంచి ప్రముఖ సంగీత కళాకారులను సింగర్లను ఫ్లైట్లో రప్పించు వారికి తిరుపతిలో హోటల్స్ లో ఆకామిడేషన్ ఇప్పించి వారి ఖర్చులన్నింటినీ కూడా నిర్మాతలు భరించారు ఇలా ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా పూర్తి చేశారని చెప్పాలి. అయితే ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించినందుకు ఎంత మేర ఖర్చ వచ్చుంటుంది అన్న ఆలోచన అందరిలోనూ మొదలైంది.ఇక ఈ సినిమా వేడుకను నిర్వహించడం కోసం సుమారు నాలుగు కోట్ల వరకు ఖర్చు చేశారని తెలుస్తుంది.

 

ఇలా ఈ సినిమా ప్రీరిలీజ్ వేడుకకు జరిగిన ఖర్చు మొత్తాన్ని ఈ మూడు నిర్మాణ సంస్థలు భరించాయట సాధారణంగా అయితే ఇలాంటి వేడుకను నిర్వహించడానికి స్పాన్సర్స్ ముందుకు వస్తారు కానీ వీరు మాత్రం స్పాన్సర్స్ కు అవకాశం లేకుండా వారే నిర్వహించబోతున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలోనే ఈ సినిమా వేడుకను నిర్వహించడం కోసం నాలుగు కోట్లు ఖర్చు వచ్చినప్పటికీ సినిమాకు తగిన స్థాయిలో పబ్లిసిటీ వచ్చిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారట.

 

Related Articles

ట్రేండింగ్

AP Roads: ఏపీలో రోడ్ల పరిస్థితిని చూపించి ఓట్లు అడిగే దమ్ముందా.. వైసీపీ నేతల దగ్గర జవాబులున్నాయా?

AP Roads:  ఒక రాష్ట్రం అభివృద్ధి బాటలో నడవాలి అంటే ముందుగా ఆ రాష్ట్రంలో మౌలిక సదుపాయాలన్నీ కూడా సక్రమంగా ఉండాలి మౌలిక సదుపాయాలు అంటే రోడ్లు కరెంట్ నీరు వంటి వాటివి...
- Advertisement -
- Advertisement -