Nag Family: ఆ డైరెక్టర్ ఉసురు వల్లే నాగ్ కుటుంబానికి ఇలాంటి పరిస్థితా?

Nag Family: తెలుగు సినిమాలకు దర్శకుడు వీరభద్రం చౌదరి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అప్పుడెప్పుడో నాగార్జున హీరోగా నటించిన భాయ్ సినిమాకు దర్శకత్వం వహించారు వీరభద్రం చౌదరి. యాక్షన్‌ కామెడీగా రూపొందిన ఈ సినిమాలో రీచా గంగోపాధ్యాయ హీరోయిన్‌గా నటించిన విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ 2013లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ఘోరమైన డిజాస్టర్ చవిచూసింది. ఈ సినిమాతో దర్శకుడు వీరభద్రం చౌదరికి పెద్ద దెబ్బ పడింది అని చెప్పవచ్చు. నాగార్జున కూడా తాను బాగానే చేశానని, తన మిస్టేక్‌ ఏం లేదనట్టుగా అప్పట్లో చెప్పడంతో ఈ సినిమా ఫ్లాప్‌కి కారణంగా దర్శకుడే అనే సందేశం వెళ్లిపోయింది.

 

ఇది ఇలా ఉంటే తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న దర్శకుడు వీరభద్రం చౌదరి ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ హీరో నాగార్జున పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భాయ్‌ సినిమాతో నా కెరీర్‌ ఆగిపోయింది. నా మొదటి సినిమా ఆహానా పెళ్లంట సూపర్‌ హిట్‌ అయ్యింది. ఆ తర్వాత పూలరంగడు మూవీ బ్లాక్‌ బస్టర్‌ హిట్ అయింది. హాయిగా సాగిపోతున్న జీవితంలో భాయ్‌ పెద్ద బ్రేక్‌ వేసిందని, ఫ్లైట్‌లో వెళ్తున్న వాళ్లని మధ్యలో ఒక్కసారిగా తోసేస్తే ఎలా అయితే ఉంటుందో నా పరిస్థితి కూడా అలాగే ఉంది అని తెలిపారు వీరభద్రం చౌదరి. మొదట నేను ఈ సినిమా కథని కామెడీ ఎంటర్‌టైనర్‌ గా చేయాలనుకున్నాను.

 

హిలేరియస్‌ కథనే చేశానని, కానీ నాగార్జున హీరో అనేసరికి రకరకాల డెవలప్‌మెంట్ల కారణంగా సీరియస్‌గా మారిపోయిందన్నారు. ఫస్ట్ నేను చెప్పిన భాయ్‌ కథ సరదాగా, జోవియల్‌గా ఉంటుందని, కామెడీగా సాగుతూ చివర్లో సీరియస్‌గా మారుతుందని, ఎప్పుడైతే నాగార్జున హీరో అనుకున్నామో, ఆ తర్వాత డెవలప్‌మెంట్ కారణంగా ఎంటర్‌టైన్‌మెంట్‌ తగ్గిపోతూ వచ్చింది. పూర్తి సీరియస్‌గా మారిపోయింది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు చౌదరి. ఆడియెన్స్ కామెడీ ఉంటుందని ఆశించారు, కానీ సీరియస్‌గా సాగడంతో వారికి రీచ్‌ కాలేదు. దీంతో ఘోరంగా పరాజయం పాలయింది అని చెప్పుకొచ్చారు చౌదరి. కాగా ఈ మూవీ డిజాస్టర్ పై నాగార్జున స్పందిస్తూ ఇందులో తన తప్పేం లేదని ప్రెస్‌ నోట్‌ రిలీజ్‌ చేశారనే ప్రశ్నకి వీరభద్రం చౌదరి రియాక్ట్ అవుతూ, తప్పు జరిగింది.

 

సినిమా ఫ్లాప్‌ అయ్యింది. దానిపై ఇప్పుడేం మాట్లాడలేం. తప్పు ఏ రూపంలో జరిగినా తప్పే, దానిపై ఒకరిపై నెట్టలేమన్నారు. ఒక సినిమా ఆడినా, ఆడకపోయినా డైరెక్టరే బాధ్యుడని నిందని తనపై వేసుకున్నారు చౌదరి. అలా మొత్తానికి నాగార్జున వల్ల తన కెరియర్ నాశనం అయ్యింది అని వీరభద్రం చౌదరి చెప్పకనే చెప్పేశారు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అక్కినేని హీరోలకి వీరభద్రం చౌదరి డైరెక్టర్ ఉసిరి తగిలింది అందుకే ఆ హీరోలు వరుసగా ఫ్లాప్స్ ని ఎదుర్కొంటున్నారు అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -