Chandu Range: కార్తికేయ2 సక్సెస్ తో చందు రేంజ్ ఇంత పెరిగిందా?

Chandu Range: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక్క సినిమా సూపర్ హిట్ అయింది అంటే చాలు వరుసగా అవకాశాలు క్యూ కడుతూ ఉంటాయి. అలాగే ఒక్క సినిమా ఫెయిల్ అయ్యిందంటే ఆ హీరో హీరోయిన్ల వైపు కానీ దర్శకుడు వైపు కానీ కనీసం కన్నెత్తి కూడా చూడరు.కాగా సవ్యసాచి సినిమాతో దర్శకుడు చందు మొండేటి పని అయిపోయిందని అందరు అనుకున్నారు. కానీ తనను ఇండస్ట్రీలోకి తీసుకువచ్చిన కార్తికేయ సినిమాకు సీక్వెల్ ను కష్టపడి తీసి, అద్భుతమైన హిట్ కొట్టాడు.

ఇలాంటి అలాంటి హిట్ కాదు. ఆ హిట్ తో ఇప్పుడు చందును ఆఫర్లు వెతుక్కుంటూ వచ్చాయి.

కానీ గీతా కాంపౌండ్ చందును తన దగ్గరకు తీసేసుకుంది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా మూడు సినిమాలు చందుతో చేసేందుకు గీతం సంస్థ అగ్రిమెంట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. మూడు సినిమాలకు కలిపి ముఫై కోట్ల రెమ్యూనిరేషన్ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. సూర్యతో ఒక సినిమా, బాలీవుడ్ లో మరో సినిమా అన్నది ముందుగా వున్న ప్లాన్. కానీ ఇప్పుడు ఈ రెండు సినిమాలకు చైతన్య సినిమా కూడా తోడయ్యేలా వుంది.

 

మొత్తానికి చందుకి కార్తికేయ సినిమా బాగా కలిసి రావడంతో పాటు మళ్ళీ బిజీ బిజీ అయ్యేలా చేసింది. ఇకపోతే మొన్నటికి మొన్న ఒక ఈవెంట్ లో ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కూడా చందు పై ప్రశంసలు కురిపించారు. ఎన్ని ఆఫర్లు వచ్చినా తమకు ఇచ్చిన మాట కు కట్టుబడి చందు అలా వుండిపోయాడని తెలిపారు. మరి చందు కి ముందు ముందు సినిమాలు ఏ మేరకు సక్సెస్ ను తెచ్చి పెడతాయో చూడాలి మరి.. ఒకవేళ చందు దర్శకత్వం వహిస్తున్న మూడు నియమాలు కనుక హిట్ అయ్యాయి అంటే ఇకపై చందు ఇది బిజీ డైరెక్టర్లలో ఒకరిగా మారిపోవడం ఖాయం అని చెప్పవచ్చు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -