Jharkhand: ఈ వ్యక్తి చరిత్ర తెలిస్తే ఛీ అనాల్సిందే.. ఏం జరిగిందంటే?

Jharkhand: ప్రస్తుత కాలంలో ఒక అబ్బాయికి పెళ్లి కావాలి అంటే అమ్మాయి నుంచి ఎన్నో రకాల కండిషన్స్ వస్తుంటాయి. మంచి ఉద్యోగం చేయాలి మంచి శాలరీ రావడమే కాకుండా బ్యాంకు బాలన్స్ మస్తుగా ఉండాలి అంటూ కండిషన్స్ పెడుతుంటారు. ఇలా అన్ని విధాలుగా బాగున్నప్పటికీ అబ్బాయిలకు అమ్మాయిలు దొరకడం చాలా కష్టమని చెప్పాలి. కానీ ఇలాజీవితంలో మంచిగా స్థిరపడిన వారికి అమ్మాయిలు దొరకడం కష్టంగా ఉన్నప్పటికీ మోసం చేసే వారికి మాత్రం పెద్ద ఎత్తున అమ్మాయిలు పడిపోతూ ఉంటారు.

ఇలా ఇప్పటికే ఎంతోమంది మహిళలు మోసపోయిన సందర్భాలను మనం చూస్తున్నాము. అయితే ఇక్కడ చదువుకున్న వారు ఉద్యోగాలు చేసేవారు ఒకరి చేతిలో మోసపోతున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే తాజాగా ఇలాంటి ఘటన జార్ఖండ్‌లోని జంషెడ్‌పుర్‌ లో చోటు చేసుకుంది.జంషెడ్‌పుర్‌ కు చెందిన తాపేష్ కుమార్ (55) అనే వ్యక్తి కలకత్తాకు చెందిన ఒక అమ్మాయిని వివాహం చేసుకున్నారు. ఇలా వివాహం తర్వాత పిల్లలు జన్మించిన అనంతరం ఈయన ఆ మహిళను వదిలి బెంగళూరు చేరుకున్నారు. అక్కడ ఉద్యోగ ఏజెన్సీని నడుపుతూ పెద్ద ఎత్తున యువతీ యువకుల నుంచి డబ్బు తీసుకొని వారిని మోసం చేశారు.

 

ఇలా పెద్ద ఎత్తున మోసాలకు తెర లేపుతూ వచ్చారు. అనంతరం ఒక మ్యాట్రిమోనీ ప్రారంభించి పెద్ద ఎత్తున మహిళలతో పరిచయాలు ఏర్పరచుకొని వారిని మోసం చేయడమే కాకుండా వారిని పెళ్లి కూడా చేసుకునేవారు. ఈ క్రమంలోనే గురు గ్రామ్ కు చెందిన ఒక మహిళను వివాహం చేసుకున్నటువంటి తాపేష్ శోభనం జరిగిన తర్వాత మూడు రోజుల పాటు ఆ యువతితో చాలా సఖ్యతగా ఉండటమే కాకుండా అనంతరం యువతి బంగారు నగలతో పాటు 20 లక్షల డబ్బు దొంగలించి పారిపోయాడు.

 

ఇక ఈ విషయం గురించి ఆ యువతీ పోలీసులను ఆశ్రయించడంతో తీగలాగితే డొంక కదిలినట్టు ఈయన బాగోతం మొత్తం బయటపడింది. ఇలా ఈయన అమ్మాయిలతో పరిచయం ఏర్పరచుకొని వారిని మోసం చేయడమే కాకుండా పెళ్లిళ్లు చేసుకుని డబ్బు నగలతో పారిపోయేవారని ఇలా సుమారు 50 మంది మహిళలను ఈయన మోసం చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇందులో అందరూ కూడా మంచిగా చదువుకొని ఉద్యోగాలు చేసే మహిళలు కావడం గమనార్హం.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -