Siddipet: భార్యాభర్తల మధ్య గొడవ.. ఒకేసారి నలుగురు అలా?

Siddipet: ఇటీవల కాలంలో చాలా మంది చిన్న చిన్న విషయాలకు మనస్పర్ధలకు గురై ఆత్మహత్యలకు పాల్పడడం లేదంటే ఎదుటి వ్యక్తులను చంపడం లాంటివి చేస్తున్నారు. క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయాల వల్ల కుటుంబాలు వీధిన పడుతున్నాయి. చాలామంది పిల్లలు అనాధలు అవుతున్నారు. తాజాగా ఒక భార్య నా భర్త చనిపోతాడని ముందే భావించి దారుణమైన నిర్ణయం తీసుకుంది. అసలేం జరిగిందంటే.. రామాయంపేట మండలం అక్కన్న పేటలో ఈ ఘటన చోటు చేసుకుంది. భార్యాభర్తల మధ్య వచ్చిన గొడవ చిలికి చిలికి గాలివానగా మారింది. ఆ గొడవ కారణంగా క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం నాలుగు నిండు ప్రాణాలు బలితీసుకుంది.

అక్కన్నపేటకు చెందిన ఎల్లం కి, మెదక్ మండలం వెంకటాపూర్ కి చెందిన లక్షీకి ఏడు సంవత్సరాల క్రితం పెళ్లి అయ్యింది. వీరికి నాలుగేళ్ల లోపు వయసున్న శరణ్య, శ్రావ్య అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఎల్లం తల్లిదండ్రుల వద్దే ఉండేవాడు. అతని తోడ బుట్టిన ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. రెండోవాడు అశోక్ కి పెళ్లి జరిగింది. మూడో తమ్ముడు రాజు కి వివాహం కాలేదు. ఎల్లం కి గ్రామంలో వ్యవసాయభూమి లేకపోవడంతో హైదరాబాద్ లో చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవినం సాగిస్తున్నాడు. అతనితో పాటు తమ్ముడు రాజు కూడా ఉంటున్నాడు. వీరందరిదీ ఉమ్మడి కుటుంబం. ఎల్లం గ్రామంలో అందరితో చాలా కలుపుగోలుగా ఉండేవాడు.

 

గత కొంతకాలంగా ఎల్లం అతని భార్య లక్ష్మికి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే మనస్థాపానికి గురైన ఎల్లం విషం తాగాడు. అది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అతడిని చికిత్స కోసం మెదక్ ఆస్పత్రికి తరలించారు. అయితే తన భర్త బతికే అవకాశం లేదని తెలుసుకున్న భార్య లక్ష్మి తన ఇద్దరు పిల్లలను తీసుకొని ఆస్పత్రి నుంచి పుట్టింటికి బయలుదేరింది. కొండూర్ వద్ద ఆగి అక్కడ ఉన్న చెరువులో ఇద్దరు పిల్లలను తోసేసి తాను కూడా నీటిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. మరోవైపు కోమాలో ఉన్న భర్త ఎల్లం కూడా కన్నుమూశాడు. ఇలా ఒకేసారి నలుగురు చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు గుండెలు విలసిలా రోదిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -