Actress: కొడుకు, కోడలిని వేధించిన ప్రముఖ నటి.. ఏం జరిగిందంటే?

Actress: ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరికి పెళ్లై పిల్లలు పుట్టిన తర్వాత వారికి తమ తల్లిదండ్రులు భారంగా మారుతున్నారు. ఈ క్రమంలోనే ఎంతోమంది తమ తల్లిదండ్రులను రోడ్లపై వదిలేసినటువంటి సందర్భాలను మనం చూస్తున్నాము. అలాగే మరికొందరు వృద్ధాశ్రమాలలో కూడా వదిలేస్తున్నారు. అయితే కేవలం సాధారణ ప్రజలలో మాత్రమే కాకుండా సెలబ్రిటీలకు కూడా ఈ విధమైనటువంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయని తెలుస్తుంది.

 

సెలబ్రిటీ పిల్లలు కూడా ఆస్తుల కోసం తల్లిదండ్రులను వేధించడం వారిని ఇంటి నుంచి బయటకు పంపించడం వంటి సంఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలోనే ప్రముఖ కన్నడ నటి శ్యామలాదేవి కూడా ఈ విధమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తెలుస్తుంది. శ్యామల దేవి భర్త మరెవరో కాదు డైరెక్టర్ సిద్ధ లింగయ్య భార్య శ్యామలాదేవి.వీరికి ఇద్దరు సంతానం కలరు. అమ్మాయి ఉమా పెళ్లి చేసుకొని లండన్ లో స్థిరపడగా కొడుకు నితిన్ కు రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ కుమార్ సుస్మితతో వివాహం చేశారు.

వీరి వివాహమైన తర్వాత శ్యామల దేవి కొత్త ఇంటిని కొనుగోలు చేసి తన కొడుకు కోడలితో కలిసి అదే ఇంట్లో నివసిస్తున్నారు. అయితే కొద్ది రోజుల తర్వాత తన కొడుకు కోడలు ఆ ఇంటిని తమ పేరుపై రాయించాలని తనకు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఈమె తెలిపారు. ఈ క్రమంలోనే ఈమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తన కొడుకు క్షమాపణలు చెప్పి తన భార్య గర్భవతిగా ఉందని ప్రస్తుతం తాము బయటకు వెళ్లడం మంచిది కాదని చెప్పి అక్కడే ఉన్నారు.

 

ఇలా కొంతకాలం మంచిగానే ఉన్నప్పటికీ తిరిగి తన కొడుకు భార్యతో కలిసి తనని హింసిస్తున్నారని ఇల్లు తమ పేరున రాయకపోతే వరకట్నంతో తనని ఇబ్బంది పెడుతున్నావు అంటూ పోలీసులకు ఫిర్యాదు చేస్తామని బెదిరిస్తున్నట్లు తెలిపారు. అలాగే లండన్ లో ఉన్న తన కుమార్తెను కూడా చంపేస్తామని బెదిరిస్తున్నారని తెలియజేశారు. ఇకపోతే తన కోడలు వంట గదిలోకి కూడా తనను రానివ్వడం లేదని అసభ్యకరమైన పదాలతో తనని తిడుతూ ఉంటుందంటూ ఈమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు తన కొడుకు కోడలు పై ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -