Ram Charan: రామ్ చరణ్ ను బద్మాష్ అంటూ బూతులు తిట్టిన ప్రముఖ స్టార్ హీరోయిన్.. ఏం జరిగిందంటే?

Ram Charan: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా వారసుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు రామ్ చరణ్ ఒకరు. చిరంజీవి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకోగా తండ్రిని మించిన తనయుడుగా ఈయన ఇండస్ట్రీలో గుర్తింపు సంపాదించుకున్నారు. చిరంజీవి క్రమశిక్షణలో పెరిగినటువంటి రామ్ చరణ్ ఎప్పుడు కూడా ఇతరుల విషయాల జోలికి వెళ్లరు.

ఎంతసేపైనా తన సినిమా పైన ఫోకస్ పెట్టి సినిమా గురించి ఆలోచిస్తూ ఉంటారు కానీ ఇతర గొడవలకు గాని ఇతర విషయాలలో తల దూర్చడం గాని రామ్ చరణ్ కు అలవాటు లేదు. ఇక ఈయన షూటింగ్ లొకేషన్లో కూడా అందరితో ఎంతో సరదాగా ఉంటారు అనే విషయం మనకు తెలిసిందే. ఇలా అందరితో ఎంతో కలిసిపోయే తత్వం ఉన్నటువంటి రాంచరణ్ ని పట్టుకొని ఒక హీరోయిన్ ఏకంగా బద్మాష్ అంటూ తిట్టడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.

రామ్ చరణ్ వంటి స్టార్ హీరోని ఇలాంటి బూతులు తిట్టినటువంటి హీరోయిన్ ఎవరు అనే విషయానికి వస్తే ఈయన ప్రస్తుతం గేమ్ చేజర్ సినిమాలో కియార అద్వానీతో కలిసి నటిస్తున్నారు. అయితే కియారాతో రామ్ చరణ్ ఇదివరకే వినయ విధేయ రామ సినిమాలో నటించారు. అయితే ఈ సినిమా విడుదల సమయంలో ప్రమోషన్లలో భాగంగా రానా వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్నటువంటి నెంబర్ వన్ యారి విత్ రానా అనే కార్యక్రమానికి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రామ్ చరణ్ ను పట్టుకొని కియారా బద్మాష్ అంటూ తిట్టేశారు.

ఈ విధంగా రాంచరణ్ ఎందుకు తిట్టారు అనే విషయానికి వస్తే… ఈమెకు తెలుగు సరిగ్గా రాకపోవడంతో ఈ సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకలో ఎలా మాట్లాడాలి అనే విషయాలను రామ్ చరణ్ తనకు చెప్పారట వేదిక పైకి రాగానే సభకు నమస్కారం అని రామ్ చరణ్ చెప్పమన్నట్టుగానే కియారా చెప్పారు. అయితే ఇదే విషయాన్ని రామ్ చరణ్ ఈ కాలంలో ఎవరైనా సభకు నమస్కారం అంటారా వెళ్లి అందరికీ నమస్కారం అంటారు కానీ అంటూ చెప్పడంతో ఒకసారిగా రాంచరణ్ పై ఒక దెబ్బ కొడుతూ బద్మాష్ నువ్వే కదా అలా చెప్పమన్నావు అంటూ సరదాగా నవ్వుతూనే మాట్లాడారు దీంతో రానా అలా చెప్పమని నువ్వే చెప్పావా అంటూ అడగడంతో అవును అంటూ చరణ్ ఎంతో అమాయకంగా సమాధానం చెబుతారు దీంతో ఈ వీడియో కాస్త వైరల్ గా మారింది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -