Parents: పేరెంట్స్ తప్పులు చేస్తే ఆ ప్రభావం పిల్లలపై.. అసలు నిజాలివే!

Parents: మనం చేసే పాపాలకు తగ్గ ఫలితం మన పిల్లలకు చెందుతుందని పూర్వీకులు చెబుతూ ఉంటారు. ఇలా తల్లిదండ్రులు ఏదైనా తప్పు చేస్తే ఆ దోషం పిల్లలను వెంటాడుతుందని ఇలా దోషాలు పిల్లలను వెంటాడుతూ వారి కెరియర్ పై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయని చెబుతుంటారు. ఇలా పెద్దలు చేసిన పాపాలు తరతరాలుగా వారి వంశస్థులను వెంటాడుతూ ఉంటాయట.

ప్రస్తుత కాలంలో తల్లిదండ్రులు తమ పిల్లలను కనుక ఏదైనా విషయంలో అరిస్తే మమ్మల్ని మేము కనమని చెప్పామా మీరే కదా కన్నారు అని తల్లిదండ్రులపై అరుస్తుంటాము నిజానికి మనం ఎవరికీ జన్మించాలి అనే విషయాలను మనమే ఎంపిక చేసుకొని ఉంటామట. మన తల్లిదండ్రులను మనమే ఎంపిక చేసుకొని వారికి జన్మిస్తారట.ఒక జీవి తాను చేసిన కర్మల ఫలితంగా వచ్చే జన్మలో ఎవరికి తల్లిదండ్రులుగా పుట్టాలి అనే విషయాలను ఎంచుకుంటారని తెలుస్తోంది.

 

ఆ కుటుంబంలో ఏ వ్యక్తి అయినా స్త్రీలకు అన్యాయం చేసిన స్త్రీ శాపం తగులుతుందని రాబోయే కొన్ని తరాలు ఆ స్త్రీ శాపానికి గురి కావాల్సి ఉంటుందట.సర్పాలను చంపితే సర్పదోషం అలాగే పిత్రులకు శార్థం పెట్టకపోతే పితృ దోషం కలుగుతుంది ఇలాంటి దోషాలు కనుక ఉన్నాయి అంటే తప్పకుండా ఆ ఇంట్లో ఎన్నో సమస్యలు ఏర్పడతాయని తెలుస్తుంది. ఇలా పెద్దలు చేసిన ఈ పాపాల కారణంగా పిల్లలకు ఇబ్బందులు తలెత్తుతూ ఉంటాయట.

 

ఈ క్రమంలోనే ఇలాంటి దోషాలు ఉన్నటువంటి వారి పిల్లలకు ఎలాంటి ఉద్యోగాలు రాకపోవడం వ్యాపారంలో నష్టాలు ఏర్పడటం అనుకున్నది సక్రమంగా జరగకపోవడం తరచూ కుటుంబంలో కలహాలు ఏర్పడటం వంటివి జరుగుతూ ఉంటాయి. ఇలా జరుగుతున్నాయి అంటే తప్పకుండా అది మన పెద్దలు చేసిన పాపాలకు తగ్గ కర్మ ఫలితమేనని పండితులు చెబుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -