Telugu Desam Party: బోస్ రాకతో అక్కడ తెలుగుదేశం పార్టీ గెలుపు ఖాయమేనా?

Telugu Desam Party: కృష్ణాజిల్లాలో వైఎస్సార్ సీపీ కి ఎదురుదెబ్బ తగిలింది. అవనిగడ్డ నియోజకవర్గంలో కీలక నేతగా ఉన్న పరుచూరి సుభాష్ చంద్రబోస్ పార్టీకి రాజీనామా చేసి తాజాగా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. పరుచూరి సుభాష్ చంద్రబోస్ కి ఆయన అనుచరులకి చంద్రబాబు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

 

పార్టీని బలోపేతం చేయడంతో పాటు వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం తనవంతు పని చేస్తానన్నారు సుభాష్ చంద్రబోస్. కమ్మ సామాజిక వర్గానికి చెందిన సుభాష్ చంద్రబోస్ 2019 ఎన్నికల్లో ఇక్కడ అన్ని తానే వ్యవహరించారు ఫలితంగా కమ్మ ఓటు బ్యాంకు వైసీపీకి అనుకూలంగా పడేలాగా చేశారని వాదన ఉంది.

 

ఆయనకి ప్రజల్లో కూడా బలమైన గుర్తింపు ఉంది కానీ ఇటీవల వైసీపీ లో అవమానాలు ఎక్కువయ్యాయి ఆయనకి. నిజానికి వచ్చే ఎన్నికలలో అవనిగడ్డ టికెట్ ను ఆయన ఆశించారు అయితే ఇస్తామని చెప్పిన అధిష్టానం ఆఖరికి ఆయనని పట్టించుకోలేదు.

దాంతో పార్టీ నుంచి బయటికి వచ్చిన బోసు తాజాగా మాజీ ఎమ్మెల్యే, ఉపసభాపతి అయిన మండలి బుద్ధ ప్రసాద్ నేతృత్వంలో పనిచేసేందుకు అంగీకరించారు. ఈ సందర్భంగా సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ వైసీపీ పాలనలో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని చూడలేక పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు.

 

చంద్రబాబు నాయుడుతోనే రాష్ట్రం అభివృద్ధి సంక్షేమం సాధ్యమని భావించి తెలుగుదేశంలో చేరినట్లు చెప్పుకొచ్చారు. బోస్ తో పాటుగా మాజీ సర్పంచ్ లు మాజీ ఎంపీటీసీలు ఇతర నేతలకు ఆహ్వానం పలికారు. వచ్చే ఎన్నికలలో రాష్ట్రం గెలవాలని అప్పుడే ప్రజలకు మంచి జరుగుతుంది ఈ నాలుగేళ్లలో ప్రజలు ఎంతో మోసపోయారు.

 

తాను రాష్ట్రం కోసం ఆలోచిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చారు బోసు. పోలవరం పూర్తి అయి ఉంటే రాష్ట్రం సుభిక్షమయ్యేదని తెలంగాణకు హైదరాబాద్ ఉన్నట్లు ఏపీకి అమరావతి ఉండాలని ప్రయత్నించాను అన్నారు. పోలవరం కట్టడానికి ఐదేళ్లు పడుతుందన్నారు ఏడాదిలో పట్టిసీమను పూర్తి చేశాను. నీళ్లు కూడా ఇచ్చాను అంటూ చెప్పుకొచ్చారు బోసు. ఈయన టీడీపీ లో చేరటం వలన లెక్కలు ఏమైనా మారనున్నాయా.. తెలుగుదేశం పార్టీ గెలుపు ఖాయమేనా అంటూ లెక్కలు వేస్తున్నారు రాజకీయ వర్గాలవారు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -