Khammam: ఈ చిట్టి తల్లి కన్నీళ్లను చూస్తే రాతిగుండైనా కరగాల్సిందే!

Khammam: రోడ్డు ప్రమాదం ఓ చిన్నారిని అనాధను చేసింది. అభం శుభం తెలియని ఆ చిన్నారి తల్లిదండ్రుల శవాల దగ్గర కూర్చొని అమ్మ నాన్న లే అంటూ రోదిస్తున్నటువంటి తీరు అందరిని కంటతడి పెట్టిస్తోంది. ఇది చూసినటువంటి స్థానికులు అయ్యో భగవంతుడా ఆ చిన్నారికి ఎందుకు ఇంత కష్టాన్ని తెచ్చావు అంటూ కంటతడి పెట్టుకుంటున్నారు. అసలు ప్రమాదం ఎలా జరిగింది? ఏంటి అనే విషయానికి వస్తే…

ఖమ్మం జిల్లా మధిర పట్టణానికి చెందిన రాధాకృష్ణ పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం కోన గ్రామానికి చెందినలీలారాణి అనే యువతని ప్రేమించి గత ఐదు సంవత్సరాల క్రితం పెద్దలను ఎదిరించి మరి వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు లక్ష్మీ కార్తీక అనే నాలుగు సంవత్సరాల కుమార్తె ఉంది.ఎంతో సంతోషంగా సాగిపోతున్నటువంటి వీరి జీవితంలో రోడ్డు ప్రమాదం తీర్చలేని విషాదాన్ని నింపింది.

 

ఎంతో సంతోషంగా గడుపుతున్నటువంటి రాధాకృష్ణ లీలారాణి తమ కుమార్తెతో కలిసి స్కూటీపై వేదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నిద్ర చేయడం కోసం గురువారం సాయంత్రం బయలుదేరారు. అయితే వీరు ప్రయాణిస్తుండగా మార్గమధ్యలో చిలకల్లు సమీపంలో వెనుక నుంచి వస్తున్నటువంటి ఫ్లయాష్ టాంకర్ ఢీకొట్టడంతో దంపతులిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ టాంకర్ ఢీకొనడంతో చిన్నారి కాస్త దూరంలో పడటంతో స్వల్ప గాయాలు పాలయ్యారు.

 

ఈ ప్రమాదం తర్వాత చిన్నారి తమ తల్లిదండ్రుల మృతదేహాలు వద్దకు వచ్చి వారిని లేపుతూ ఏడుస్తున్నటువంటి తీరు స్థానికుల హృదయాలను కలచివేసింది. అయితే ఈ విషయం తెలుసుకున్న టువంటి స్థానిక ఎస్సైహుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకొని చిన్నారిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు అనంతరం ప్రమాదానికి గురైన లారీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -