Trivikram-Pawan: త్రివిక్రమ్ ను నమ్మి పవన్ కళ్యాణ్ తప్పు చేస్తున్నారా.. ఏం జరిగిందంటే?

Trivikram-Pawan: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్ చేసిన దర్శకుల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. చెప్పదలుచుకున్న విషయాన్ని తక్కువ డైలాగులతో లోతైన భావాలున్న మాటలు రాయటం త్రివిక్రమ్ ప్రత్యేకత. అలాంటి త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ కి పెద్ద అభిమాని. ఆయన పవన్ కళ్యాణ్ అభిమానాన్ని ఎంతగా సొంతం చేసుకున్నారంటే పవన్ కళ్యాణ్ తో సినిమా తీయాలంటే ముందు త్రివిక్రమ్ ని సంప్రదించాలంట. ఆయన ఓకే చేస్తేనే ప్రాజెక్టు ముందుకు వెళుతుందట.

ఒక స్టార్ హీరో కెరియర్ చేతిలో ఉండడం అంటే మామూలు విషయం కాదు. అసలు అది త్రివిక్రమ్ కి ఎలా సాధ్యపడి ఉండొచ్చు అంటే అదంతా త్రివిక్రమ్ మాటల మాయాజాలం అంటున్నారు సినీ వర్గాల వారు. పవన్ కళ్యాణ్ ముందు తెలివితేటలు ప్రదర్శించేవాడు అమాయకుడు. తెలివి ఉన్నా ప్రదర్శించని వాడు తెలివైనవాడు. మొదటి రకంనికి చెందిన వాళ్లు కొందరైతే రెండో కోవకి చెందిన వాడు ఈ త్రివిక్రమ్.

 

పవన్ కళ్యాణ్ కి కొత్త విషయాలు తెలుసుకోవాలని కుతూహలం ఉంటుంది. తాను ఒక మేధావిలాగా గుర్తింపు తెచ్చుకోవాలని కోరిక ఉండొచ్చు. ఎంతటి క్లిష్టమైన విషయాన్ని అయినా లోతుగా విశ్లేషించగల తెలివి ఉన్న వ్యక్తిగా ప్రపంచం తనని గుర్తించాలని ఆశ ఉన్నవాడు. ఆ కోరికని సైకలాజికల్గా తీర్చిన తీరుస్తున్న వ్యక్తి త్రివిక్రమ్.

 

అలా పవర్ స్టార్ లోని పవర్ ని తీసుకుని సెట్టింగు కాస్తంత పర్యవేక్షణ చేసి కోట్లలో సంపాదిస్తున్నాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. పవన్ కళ్యాణ్ ఒక బంగారు బాతు దాని చేత జాగ్రత్తగా గుడ్డు పెట్టించుకుని అమ్ముకుంటున్నాడు ఈ తెలివైన మాటల మాంత్రికుడు. అయితే త్రివిక్రమ్ని నమ్మి కళ్యాణ్ తప్పు చేస్తున్నాడా.. ఆ మాటల మాంత్రికుడిని నమ్మడమే పవన్ కళ్యాణ్ కి శాపం గా మారిందా..పవన్ కళ్యాణ్ ఒక్కసారి విశ్లేషించుకుంటే బాగుంటుంది అంటున్నారు సినీ వర్గాల వారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -