Pawan Kalyan Insta: ఈ హీరోయిన్లకు పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి.. ఏం జరిగిందంటే?

Pawan Kalyan Insta: తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలలో కూడా చాలా చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే ఈయన ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు వారాహి యాత్రలో ఎంతో బిజీగా ఉన్నారు. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ ఇదివరకు ట్విట్టర్ ద్వారా మాత్రమే తన రాజకీయాలకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకునేవారు.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ట్విట్టర్ మాత్రమే కాకుండా ఇంస్టాగ్రామ్ లోకి కూడా అడుగుపెట్టిన సంగతి మనకు తెలిసిందే. జూలై 4వ తేదీన ఎలుగెత్తు.. ఎదిరించు.. ఎన్నుకో.. జైహింద్ అంటూ ఒక బయోతో తన ఇన్ స్టా ఖాతాను ఓపెన్ చేశారు. ఈ విధంగా పవన్ కళ్యాణ్ ఇంస్టాగ్రామ్ లోకి అడుగుపెట్టడంతో ఈయనకు క్షణక్షణానికి ఫాలోవర్స్ పెరుగుతూ వచ్చారు..

 

ఇప్పటివరకు ఏ హీరో కూడా సృష్టించని రికార్డ్ ఈయన సృష్టించారు కేవలం 6 గంటలలోనే ఒక మిలియన్ ఫాలోవర్స్ ను సొంతం చేసుకున్నారు.. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఇంస్టాగ్రామ్ లో దాదాపు 2.5 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.ఇలా అతి తక్కువ సమయంలోనే ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకోవడం కేవలం పవన్ కళ్యాణ్ కు మాత్రమే సాధ్యమైంది. అయితే ఈయనని అభిమానులు మాత్రమే కాకుండా సెలబ్రిటీలు కూడా ఇంస్టాగ్రామ్ లో ఫాలో కావడం విశేషం.

 

పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలో ఎంతోమంది సెలబ్రిటీలకు ఫేవరెట్ హీరోగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. అయితే తాజాగా కొందరు స్టార్ హీరోయిన్స్ పవన్ కళ్యాణ్ ఇంస్టాగ్రామ్ లో ఫాలో అవుతూ వారి అభిమానాన్ని చాటుకున్నారు. మరి ఇంస్టాగ్రామ్ లో పవన్ కళ్యాణ్ అనుసరిస్తున్నటువంటి ఆ హీరోయిన్స్ ఎవరు అనే విషయానికి వస్తే స్టార్ హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న శృతిహాసన్, కీర్తి సురేష్, శ్రీ లీల వంటి హీరోయిన్స్ పవన్ కళ్యాణ్ ను ఇంస్టాగ్రామ్ లో ఫాలో అవడం విశేషం.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -