Upasana: క్లీంకార విషయంలో ఉపాసన తల్లి మనస్సుకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే!

Upasana: మెగా కోడలు ఉపాసన పెళ్లయిన 11 సంవత్సరాలకు ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం మనకు తెలిసిందే. ఈ విధంగా ఉపాసన గత నెల 20వ తేదీ హైదరాబాద్ అపోలో హాస్పిటల్లో జన్మనిచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఈ చిన్నారికి క్లీన్ కారా అని నామకరణం చేశారు. ఇక చిన్నారి బారసాల వేడుకను కూడా ఎంతో ఘనంగా నిర్వహించిన సంగతి మనకు తెలిసిందే. ఇకపోతే ఉపాసన చిన్నారి కోసం ఎంతో జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది.

తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా తన చిన్నారి కోసం హాస్పిటల్ గదిని చాలా ప్రత్యేకంగా డిజైన్ చేయించారనే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ వెల్లడించారు.తాను హాస్పిటల్ లో జన్మనిచ్చినప్పటికీ తన కుమార్తె కళ్ళు తెరిచి చూసేసరికి తనకు హాస్పిటల్ అనే ఫీలింగ్ లేకుండా తన హాస్పిటల్ గదిని డెలివరీకి ముందే ప్రత్యేకంగా డిజైన్ చేయించారట.

 

తన గది మొత్తం ఒక అడవిని తలపించే విధంగా పక్షులు జంతువులతో ఉన్నటువంటి కర్టన్స్ వేయించారని ఈ వీడియోలో తెలియచేశారు. అంతేకాకుండా ప్రత్యేకంగా ఈ గదిని డిజైన్ చేయడం కోసం ఎంతోమంది డిజైనర్స్ కష్టపడ్డారని తెలుస్తోంది. ఇలా తన కుమార్తె ఒక ప్రకృతిలో పెరుగుతున్నటువంటి ఫీలింగ్ తనకు రావడం కోసమే హాస్పిటల్ గదిని కూడా ఇలా డిజైన్ చేయించారని తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

ఇక ఈ వీడియోని ఉపాసన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ… అమ్రాబాద్ ఫారెస్ట్, వేదిక్ వైద్యశాల అంశాలను స్ఫూర్తిగా తీసుకొని ఇంటీరియర్ డిజైన్ సిద్ధం చేసినట్లు ఈమె తెలిపారు. ఇలా తన కుమార్తె కోసం ప్రత్యేకంగా ఇలాంటి ఏర్పాట్లు చేసినటువంటి డిజైనర్ పవిత్ర రాజా రామ్ కి ఉపాసన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ షేర్ చేసినటువంటి ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -