TDP: కృష్ణా జిల్లాలోని ఆ నియోజకవర్గంలో టీడీపీకే అనుకూల ఫలితాలా?

TDP: ఏపీలో గత కొద్దిరోజులుగా ముందస్తు ఎన్నికలకు సంబంధించిన హడావిడి కనిపిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. సీఎం జగన్ నాలుగు రాష్ట్రాల ఎన్నికలతో ముందస్తు ఎన్నికలకు వెళ్తారు అన్న ప్రచారం జోరుగా కొనసాగుతోంది. అటు జగన్ తో పాటు ఇటు చంద్రబాబు, అటు జనసేన అధినేత పవన్ ఇప్పటికే ఎన్నికల వ్యూహాల్లో మునిగిపోయారు. టీడీపీ యువనేత నారా లోకేష్ సైతం యువగళం పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు. ఇదిలా ఉంటే వచ్చే సాధారణ ఎన్నికలలో ఉమ్మడి కృష్ణ, గుంటూరు జిల్లాలలో రాజధాని అమరావతి ప్రభావం అధికార వైసీపీపై గట్టిగా ఉంటుందని, ఈ రెండు జిల్లాలలో వైసీపీకి గట్టి ఎదురు దెబ్బలు తగులుతాయని వైసీపీ నేతలు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు.

రాజధాని మార్పు ప్రభావంతో పాటు వైసీపీ తర్వాత అక్కడ ప్రజలు అనేక విధాలుగా భారీగా నష్టపోయారు. ఈ క్రమంలోనే ఈ రెండు జిల్లాలలో ఈసారి టీడీపీ సైకిల్ బ్రేకులు లేకుండా దూసుకుపోతుందని ఇప్పటికే కొన్ని విశ్లేషణలు వ్యక్తం అవుతున్నాయి. ఇదిలా ఉంటే ఉమ్మడి కృష్ణా జిల్లాలోని ఒక నియోజకవర్గంలో టీడీపీ పార్టీ కచ్చితంగా 50 వేల ఓట్ల పైచిలుకు బంపర్ మెజార్టీతో గెలవబోతుందన్న చర్చలు జిల్లాలో వినిపిస్తున్నాయి. ఆ నియోజకవర్గం ఏదో కాదు పెనమలూరు. కాగా ప్రస్తుతం అక్కడ వైసీపీ నుంచి మాజీమంత్రి కొలుసు పార్థసారథి ఎమ్మెల్యేగా ఉన్న విషయం మనందరికీ తెలిసిందే.

 

అయితే ఈ నియోజకవర్గ టీడీపీ కంచుకోటగా ఉంటూ వస్తోంది. 2014 ఎన్నికలలో ఇక్కడి నుంచి మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ 37వేల ఓట్ల భారీ మెజార్టీతో ఘనవిజయం సాధించారు. అయితే ఈసారి మళ్లీ టీడీపీ అభ్యర్థిగా ప్రసాద్ రంగంలో ఉండనున్నారు. అలాగే పార్టీ యువనేత నారా లోకేష్ పేరు కూడా ఇక్కడ వినిపిస్తోంది. టీడీపీ జనసేన పొత్తులో భాగంగా పెనమలూరు నుంచి ఎవరు? బరిలో ఉన్న వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే పార్థసారథి పోటీ చేస్తే ఈసారి కచ్చితంగా టిడిపి అభ్యర్థికి 50 వేల ఓట్ల మెజార్టీ వస్తుంది అని జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈసారి పెనమలూరులో వచ్చే మెజార్టీ జిల్లాలోని అత్యధికంగా ఉండబోతుందని కూడా రాజకీయ నేతల మధ్య అంతర్గత చర్చల్లో వినిపిస్తోంది. అలాగే ఉమ్మడి కృష్ణ, గుంటూరు జిల్లాలలో చాలా నియోజకవర్గాలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల మెజార్టీలు 30 నుంచి 40 వేల మధ్యలో ఉండబోతున్నాయని కూడా విశ్లేషణలు ఇప్పటికే వ్యక్తమవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -