Venkatesh Marriage: స్టార్ హీరో వెంకటేశ్ పెళ్లి విషయంలో ఏకంగా ఇన్ని ట్విస్టులు ఉన్నాయా?

Venkatesh Marriage: విక్టరీ వెంకటేష్ గురించి పరిచయాలు అవసరం లేదు. లెజెండరీ ప్రొడ్యూసర్ రామానాయుడు కొడుకుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి తన టాలెంట్ నిరూపించుకుని స్టార్ హోదాని అందుకున్నాడు. ఫ్యామిలీ హీరో ఇమేజ్ సొంతం చేసుకుని భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ప్రొడ్యూసర్ కొడుకుగా కలియుగ పాండవులు సినిమా ద్వారా సినీ రంగ ప్రవేశం చేసి మొదటి సినిమాతోనే హిట్ కొట్టాడు.

ఆ రోజుల్లో వెంకటేష్ కి లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువగా ఉండేది. ఇప్పటికీ ఆ తరం నటులలో సక్సెస్ఫుల్గా నటిస్తున్న నటులలో వెంకటేష్ ఒకరు. అయితే వెంకటేష్ గురించి వృత్తిపరమైన సమాచారమే తప్పితే ఎప్పుడూ వ్యక్తిగతమైన సమాచారం ఎవరికి తెలియదు. ఆయన కూడా తన భార్య గురించి తన పిల్లల గురించి ఎక్కడ బయట మాట్లాడకపోవటం విశేషం. వెంకీ సినిమా ఈవెంట్స్ కి కూడా వాళ్ళు చాలా దూరంగా ఉంటారు.

 

ఇంత సక్సెస్ఫుల్ హీరోకి వాళ్ళ తండ్రి రామానాయుడు బలవంతపు పెళ్లి చేశారని మీకు తెలుసా.. నిజమేనండి ఆ రోజుల్లో ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్ల సంగతి ఒక ప్రొడ్యూసర్ గా రామానాయుడు కి తెలిసిందే. అయితే అప్పుడే సిని రంగ ప్రవేశం చేసిన కొడుకు ఏ హీరోయిన్ వల లో అయినా పడిపోతాడేమో కంగారు పడిన తండ్రి ఇండస్ట్రీకి సంబంధంలేని ఒక వ్యక్తిని వెంకటేష్ కిచ్చి పెళ్లి జరిపించాడు.

 

ఆ రోజుల్లోనే కులం పట్టింపులు లేకుండా గుణగణాలకే ప్రాధాన్యతని ఇచ్చి చిత్తూరు జిల్లా మదనపల్లి కు చెందిన నీరజారెడ్డి తో వెంకటేష్ వివాహం అంగరంగ వైభవంగా జరిపించాడు రామానాయుడు. అయితే అప్పుడే పెళ్లి చేసుకోవడం వెంకటేష్ కు ఇష్టం లేదట. కెరియర్ లో తను అనుకున్నది సాధించిన తర్వాత పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు అంట. కానీ పాపం అతనికి ఆ అవకాశం ఇవ్వలేదు రామానాయుడు. పెళ్లి బలవంతంగా చేసుకున్నప్పటికీ వారిది అన్యోన్య దాంపత్యం. వారికి ముగ్గురు ఆడపిల్లలు కొడుకు అర్జున్ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -