Saindhav Teaser: సైకో ‘సైంధవ్’.. ఇలాంటి పాత్రలు మీకు అవసరమా వెంకీ.. ఫ్యాన్స్ ద్వేషించేలా?

Saindhav Teaser: టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ గురించి మనందరికీ తెలిసిందే. తెలుగులో ఎన్నో సినిమా లలో నటించి హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరుచుకున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, కామెడీ, ఎమోషనల్ ఇలా అన్నీ రకాల జోనర్ ల సినిమాలలో నటించిన ప్రేక్షకులను మెప్పించారు. కాగా వెంకటేష్ ఇటీవలె ఎఫ్ 3 సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే వెంకటేష్ నటించిన పాన్ ఇండియా సినిమా సైంధవ్. తాజాగా ఈ మూవీ టీజర్ ను విడుదల చేశారు.

ఫ్యామిలీ ఎమోషన్ తో కూల్ గా మొదలైన టీజర్ తర్వాత యాక్షన్ ప్యాక్డ్ గా మారింది. కాగా ఆ టీజర్ లో కొంత కథని కూడా చెప్పే ప్రయత్నం చేశారు. విలన్‌గా నవాజుద్దీన్ సిద్ధిఖీ పెద్ద డ్రగ్ అసైన్‌మెంట్‌ తీసుకుంటాడు. చిన్న పిల్లలుకు శిక్షణ ఇచ్చిన సంఘ విద్రోహ శక్తులుగా మారుస్తుంటాడు. విలన్ నవాజ్ పాత్రే వెంకటేష్‌ను సైకో గా పరిచయం చేస్తుంది.

అసలు ఈ మిషన్ లో వెంకటేష్ పాత్ర ఏమిటి ? అతని కమ్ బ్యాక్ వలన ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనేది ఆసక్తిని రేపుతోంది. టీజర్ చాలా స్టయిలీష్ అలాగే సాలిడ్ యాక్షన్ తో ఉంది. అలాగే ఇందులో వెంకటేష్ పాత్రకు రెండు కోణాలు ఉన్నాయి. ఫ్యామిలీ పై ఓపెన్ చేసిన టీజర్ ఫ్యామిలీ తోనే ముగించారు. చివర్లో వెంకీ చెప్పిన డైలాగ్ మాస్ ని అలరిస్తుంది.

కాగా ఈ మూవీకి దర్శకుడు శైలేష్ వెంకీ దర్శకత్వం వహించారు. సంతోష్ నారాయణ్ నేపధ్య సంగీతం టీజర్ కి ప్రాధాన ఆకర్షణగా నిలిచింది. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. కాగా తాజాగా విడుదల అయిన టీజర్ ని చూసిన అభిమానులు ఇలాంటి పాత్రలు నీకు అవసరమా వెంకీ అంటూ వెంకటేష్ పై మండిపడుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -