Saindhav: సంక్రాంతి సినిమాల్లో భారీ నష్టాలు మిగిల్చిన సైంధవ్.. ఏమైందంటే?

మామూలు సినిమా ఒక సంవత్సరంలో ఎప్పుడు రిలీజ్ అయినా దానికి వచ్చే కలెక్షన్లు కన్నా పండగ పూట రిలీజ్ అయితే దానికి కలెక్షన్లు అధికంగా వస్తాయి. అందులోని సంక్రాంతి పండుగకి ఒక సినిమా విడుదలయితే మామూలు టైం లో వచ్చే కలెక్షన్ల కన్నా ఎక్కువ వసూళ్లే రాబట్టొచ్చు. ముందు సినిమాలలో చూసుకుంటే అలా వైకుంఠపురంలో, గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలు సంక్రాంతికి విడుదల కావడం వల్లే వసూలు చేయవలసిన దానికన్నా రెట్టింపు వసూళ్లను సంపాదించుకున్నాయి.

 

అలాగని సంక్రాంతికి ఎక్కువ సినిమాలు విడుదల చేస్తే థియేటర్లు తక్కువై ఓపెనింగ్స్ ఎక్కువగా రావు. ఈసారి సైంధవ్ సినిమా విషయంలో కూడా అదే జరిగింది. ఈ సంవత్సరం సంక్రాంతికి సినిమాల మధ్య కాంపిటేషన్ చాలా గట్టిగా ఉంది. ఇందులో హనుమాన్ విన్నర్ గా తేల్చి చెప్పేశారు. గుంటూరు కారం, నా సమీరంగా అంతంతమాత్రంగా ఉన్నా సైంధవ్ మాత్రం కంటెంట్ లేక, కాంపిటీషన్ ఎక్కువై, కలెక్షన్లు తగ్గిపోయాయి.

థియేటర్లన్నీ ఖాళీలైపోయాయి. గట్టి కాంపిటీషన్ ఉన్నప్పుడు కంటెంట్ లేకపోతే ఉన్నదానికన్నా సంక్రాంతి అప్పుడు విడుదల చేస్తే నష్టం గట్టిగా ఉంటుంది. ఇప్పుడు సైంధవ్ కి కూడా అదే పరిస్థితి వచ్చింది. సంక్రాంతికి విడుదల చేస్తే డబ్బులు ఎక్కువ వస్తాయని ఈ కాంపిటీషన్లో దిగింది ఈ చిత్రం, కానీ మిగిలిన చిత్రాల ముందు ఇది తేలలేక పోయింది. అందుకే పండక్కి విడుదల చేశామా లేదా అని కాదు కంటెంట్ ఉందా లేదా అని కూడా ముందు వెనుక చూసుకోవాలి.

 

అదే సినిమా ఈ కాంపిటీషన్ లేకుండా స్టాండ్ అలోన్ గా విడుదల అయ్యుంటే వెంకటేష్ ని చూసైనా ప్రేక్షకులు థియేటర్లకు తరలివచ్చేవారు. అప్పుడు కలెక్షన్లు ఉండేవేమో. వెంకటేష్ 75వ చిత్రంగా ఎక్కువ అంచనాలతో విడుదలైంది ఈ సినిమా. కానీ హనుమాన్ హంగామా లో ఎవరు ఈ సినిమాని పట్టించుకోవడం లేదు. సంక్రాంతికి విడుదల చేయడమే ఈ సినిమా చేసిన పెద్ద తప్పు.

Related Articles

ట్రేండింగ్

YSR Cheyutha Scheme: డబ్బులన్నావ్.. డబ్బాలు కొట్టుకున్నావ్.. చేయూత నాలుగో విడత జమయ్యాయా జగన్?

YSR Cheyutha Scheme: జగన్మోహన్ రెడ్డి ఇటీవల తన ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన సంగతి తెలిసిందే .ఈ మేనిఫెస్టోలో భాగంగా ఈయన గత ఐదు సంవత్సరాల కాలంలో ఏ సామాజిక వర్గానికి...
- Advertisement -
- Advertisement -