Saindhav review: సైంధవ్ మూవీతో వెంకీ బ్లాక్ బస్టర్ సాధించాడా.. రిజల్ట్ ఏంటంటే?

Saindhav review: సైంధవ్ సినిమా రివ్యూ.

విడుదల తేదీ : జనవరి 13, 2024
నటీనటులు : వెంకటేష్, శ్రద్ధ శ్రీనాథ్, నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆర్య, రుహాని శర్మ, ఆండ్రియా, బేబీ సారా, జయప్రకాష్ తదితరులు.
నిర్మాణ సంస్థ: నిహారిక ఎంటర్టైన్మెంట్స్.
నిర్మాత వెంకట్ బోయినపల్లి.
దర్శకత్వం:శైలేష్ కొలను.
సినిమాటోగ్రఫీ : ఎస్ మణికందన్.
సంగీతం సంతోష్ నారాయణన్.

ఈ సంక్రాంతికి అగ్ర కథానాయకుల చిత్రాలతో తెలుగు బాక్స్ ఆఫీస్ కళకళలాడుతుంది మహేష్ బాబు గుంటూరు కారంతో వచ్చి అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు ఇక సైంధవ సినిమాతో వెంకటేష్ జనవరి 13న వచ్చాడు ఈ సినిమా వెంకటేష్ కెరియర్ లో 75వ సినిమా. సంక్రాంతికి విడుదల కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి టీజర్ అండ్ ట్రైలర్స్ ఏర్పడింది. యాక్షన్ సీక్వెన్స్ ఉన్నప్పటికీ కుటుంబ కదికి కూడా ప్రాధాన్యం ఉన్న సినిమా ఇది మరి ఈ సినిమా ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుందో ఒకసారి చూద్దాం.

 

కథ : చంద్రప్రస్తా అనే కల్పిత నగరం నేపథ్యంలో సాగే కథ ఇది సైంధవ కోనేరు అలియాస్ సైకో ( వెంకటేష్) తనకి ప్రాణానికి ప్రాణమైన కూతురు గాయత్రి ( బేబీ సారా ) తో కలిసి నివసిస్తుంటాడు భర్త నుంచి విడిపోయిన మనో ( శ్రద్ధ శ్రీనాథ్) తో అనుబంధం ఏర్పడుతుంది గతంలో కార్తెలు సంస్థలు పనిచేసిన సైకో పెళ్లి తర్వాత భార్యకి ఇచ్చిన మాట కోసం అక్కడ పనిచేయడం మానేసి కూతురే ప్రపంచంగా బ్రతుకుతూ ఉంటాడు ఇంతలో స్పైనల్ మస్కులర్ ఆట్రోఫీ అనే జబ్బుతో కూతురు ప్రాణాలకు 3 ఏర్పడుతుంది ఈ జబ్బు నుంచి బయటపడాలంటే 17 కోట్ల విలువ చేసే ఇంజక్షన్ అవసరమని సూచిస్తారు డాక్టర్లు అంత డబ్బుని సైకో ఎలా సంపాదించాడు తన బిడ్డ ప్రణాళినే కాపాడుకున్నాడా లేదా.. చిన్నపిల్లల అక్రమ రవాణా తో పాటు ఆయుధాలు సరఫరా చేసే కార్టెల్ సంస్థ నడుపుతున్న వికాస్ మాలిక్ ( నవాజుద్దీన్ సిద్ధిఖీ ) మిత్ర( ముఖేష్ ఋషి ) తో ఏ విధంగా ఫైట్ చేశాడు ఇలాంటి విషయాలని తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

నటీనటుల పనితీరు : వెంకటేష్ యాక్షన్ సీక్వెన్స్ చేస్తే ఎలా ఉంటుందో గతంలో మనం చాలా సినిమాలలో చూశాము ఆయన ఈ సినిమాలో చాలా స్టైలిష్ గా కనిపిస్తారు ఆయన చేసిన పోరాట గట్టాలు ఆకట్టుకుంటాయి భావోద్వేగాలతో కూడిన సన్నివేశాలలో తనదైన ముద్రవేశారు. ఇక నవాజుద్దీన్ సిద్ధికి గురించి మాట్లాడుకుంటే ఆయన పాత్రని డిజైన్ చేసిన విధానం చాలా బాగుంది గమ్మత్తుగా కనిపిస్తూనే భయపడుతూ ఉంటాడు హిందీలోనే ఎక్కువగా సంభాషణలు ఉంటాయి. శ్రద్ధ శ్రీనాథ్ ఆండ్రియా రుహాని శర్మ ముకేశ్ రుషి జయప్రకాష్ తదితరులు పాత్రల పరిధి మేరకు నటించారు. సాంకేతికపరంగా కెమెరా విభాగానికి ఎక్కువ మార్కులు పడతాయి మణికంఠ ఇంద్రప్రస్థ నేపద్యాన్ని చూపించిన తీరు ఆకట్టుకుంది అలాగే నేపథ్య సంగీతం అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైన్ సినిమాకు ఆకర్షణగా నిలిచాయి. కథనం పరంగా చూస్తే కసరత్తు సరిపోలేదనిపిస్తుంది అంటున్నారు ప్రేక్షకులు.

 

విశ్లేషణ : విక్రంలో కమల్ హాసన్ జైలర్ తో రజనీకాంత్ కొత్త తరం యాక్షన్ సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు నమోదు చేశారు. వెంకటేష్ తన 75వ చిత్రం కోసం అలాంటి కథను ఎంచుకోవడంతో ప్రత్యేకమైన ఆసక్తి ఏర్పడింది. థ్రిల్లర్ సినిమాలను బాగా తీస్తాడని పేరున్న శైలేష్ కొలనుఈ సినిమాకి దర్శకుడు అని తెలియగానే సినిమాపై అంచనాలు మరిన్ని పెరిగాయి. వెంకటేష్ ని దర్శకుడు చూపించిన విధానం చాలా బాగుంది అయితే కథని తెరపై తీసుకువచ్చే క్రమంలో లెక్క తారుమార ఏంది గత చిత్రాల్లో అడుగడుగునా ప్రేక్షకుల్ని తెలియజేసేలా సన్నివేశాన్ని మలిచిన శైలేస్ సైంధవ విషయంలో ఎందుకో తడబడ్డాడు. కదా బాగున్నప్పటికీ కథనం సాదాసీదాగా అనిపిస్తుంది దాంతో ఏ దశలోనూ సినిమా ప్రతి కట్టదు. సైకో డబ్బు అందుకునే క్రమంలో ఎదురయ్యే చిక్కుముడలతో ఫస్ట్ హాఫ్ పర్వాలేదనిపిస్తుంది కానీ సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి ఎందుకో ఏ ఒక్క అంశానికి పరిపూర్ణత లేకుండా కేవలం యాక్షన్ ఎపిసోడ్ తోనే సినిమాని నడిపించేయడం అనేది సినిమాకి మైనస్ అయింది అంటున్నారు ప్రేక్షకులు. ఇందులో వెంకటేష్ స్టైలిష్ లుక్ నవాజుద్దీన్ సిద్ధికి నటన మినహా చెప్పుకోదగ్గ అంశం ఏది కనిపించదు.

 

ప్లస్ పాయింట్స్…
వెంకటేష్ నటన
యాక్షన్స్ సన్నివేశాలు
నవాజుద్దీన్ సిద్ధిఖీ పాత్ర.

మైనస్ పాయింట్స్
ఆకట్టుకొని కథనం
భావోద్వేగాలు పెద్దగా లేకపోవడం

రేటింగ్: 3/5

Related Articles

ట్రేండింగ్

Union Minister Piyush Goyal: వైఎస్సార్ ను సైతం ముంచేసిన సీఎం జగన్.. ఆ కేసులో కావాలనే ఇరికించారా?

Union Minister Piyush Goyal: వైయస్సార్ కాలనీ పట్ల కేంద్రమంత్రి పియూష్ గోయెల్ తన ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో పీయూష్ గోయల్ విలేకరులతో మాట్లాడుతూ జగన్ పాలనపట్ల విరుచుకుపడ్డారు. వైయస్సార్ కాంగ్రెస్...
- Advertisement -
- Advertisement -