Kishan Reddy: నేనేమైనా టెర్ర‌రిస్టునా? పోలీసులకు భారీ షాకిచ్చిన కిషన్ రెడ్డి!

Kishan Reddy: తెలంగాణ రాజకీయాలు మంచి జోరు మీద ఉన్నాయి ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని ఎ ఎత్తుల పై ఎత్తుల వేస్తున్నాయి పార్టీలు. అందులో భాగంగానే బిజెపి తెలంగాణ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రజా సమస్యలను తెలుసుకుంటానంటే బాటసింగారంలో ఉన్న డబల్ బెడ్ రూమ్ ఇండ్ల సముదాయాలను పరిశీలించేందుకు బయలుదేరి ఆయనని నటురోడ్డు మీద అరెస్టు చేశారు పోలీసులు.

ఇంతకీ ఏం జరిగిందంటే రాష్ట్రంలో నెలకొన్న ప్రజా సమస్యలను గుర్తించడంలో భాగంగా హైదరాబాదు శివారులోని బాటసింగారంలో 8 ఏళ్లుగా ఆ సంపూర్ణంగా ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సముదాయాలు పరిశీలించేందుకు బిజెపి నేతలు ఇవాళ పిలుపునిచ్చారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు బిజెపి నేతలని ఎక్కడికి అక్కడ అరెస్టులు చేస్తూ భంగం కలిగిస్తూ వచ్చారు. బిజెపి పార్టీ ఎమ్మెల్యేలైన ఈటెల రాజేందర్ డీకే అరుణ లను హౌస్ అరెస్టు చేశారు.

 

అలాగే ఢిల్లీ నుంచి వచ్చిన కిషన్ రెడ్డి నేరుగా బాటసింగారానికి బయలుదేరడానికి ప్రయాణమయ్యారు అయితే పోలీసులు మార్గమధ్యంలోనే ఆయన కాన్వాయ్ ని అడ్డుకున్నారు దీంతో ఆగ్రహించిన కిషన్ రెడ్డి రోడ్డుపైనే బైఠాయించి తన నిరసన తెలియజేశారు. బాటసింగారానికి వెళ్లడానికి మీకు అనుమతి లేదు అన్న పోలీసులుతో వాగ్వాదానికి దిగారు. నేనేమైనా ఉగ్రవాదినా టెర్రరిస్ట్ నా అని ప్రశ్నించారు.

 

నన్ను చంపుతారా.. చంపుకోండి అంటూ పోలీసులపై ఫైర్ అయ్యారు. ఎట్టి పరిస్థితులలోనూ నేను బాటసింగారం వెళ్లి తీరుతానని అలా కాని పక్షంలో ఇంటికి వెళ్లే ప్రసక్తి లేదంటూ బోరున వర్షం పడుతున్నా ఆ నడిరోడ్డు మీదే భీష్మంచుకు కూర్చున్నారు. అయినా నేను కేంద్ర మంత్రిని నాకు ఎందుకు అనుమతి లభించలేదు అంటూ పోలీసులని నిలదీశారు.పరిస్థితి అదుపుతప్పుతుందని గ్రహించిన పోలీసులు ఎమ్మెల్యే రఘునందన్ తో సహా కిషన్ రెడ్డిని అరెస్టు చేసి బిజెపి కార్యాలయానికి తీసుకువెళ్లారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -