Balayya Boxoffice: సంక్రాంతి పోటీ దసరాకు రిపీట్.. బాలయ్యే బాక్సాఫీస్ ను దున్నేస్తాడా?

Balayya Boxoffice: అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న భగవత్ కేసరి దసరాకి రిలీజ్ చేస్తామని ప్రకటించారు మూవీ మేకర్స్. అలాగే తళపతి విజయ్ మూవీ లియో కూడా దసరా రోజు రిలీజ్ చేస్తున్నట్లు ఆ మూవీ మేకర్స్ కూడా అనౌన్స్ చేయటంతో ఇప్పుడు అందరి దృష్టి దసరా మీదే పడింది. తమిళ స్టార్ హీరో విజయ్ సంక్రాంతికి వారసుడు సినిమాతో వచ్చి మనల్ని పలకరించి వెళ్ళాడు అయితే ఆ సినిమా తమిళంలో ఆడినట్లుగా తెలుగులో ఆడలేదు.

అయితే ఇప్పుడు దసరాకి లియోగా వస్తున్నాడు. విజయ్ 67వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా తమిళ యువ దర్శకుడు వరుసహిట్లతో దూసుకుపోతున్న లోకేష్ కనగరాజు ఎక్కిస్తున్నాడు. వీళ్ళిద్దరి కాంబినేషన్ లో గతంలో మాస్టర్ సినిమా ద్వారా మంచి విజయాన్ని సాధించారు. దీంతో డబ్బింగ్ సినిమా అయినప్పటికీ ఈ సినిమా మీద మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

 

ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిష నటిస్తుండగా ప్రియా ఆనంద్, సంజయ్ దత్ లాంటి హేమహేమీలు ఈ సినిమాకి మరొక ప్లస్ పాయింట్. అయితే అదే రోజు నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా రూపొందుతున్న భగవద్ కేసరి కూడా అదే రోజు రిలీజ్ చేస్తున్నట్లు మూవీ మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. అక్టోబర్ 19 గురువారం వచ్చింది అప్పటినుంచి 24వ తేదీ పండగ వరకు సెలవులు ఉంటాయి కాబట్టి మంచి వసూళ్లు వచ్చే అవకాశం ఉంది.

 

బాలకృష్ణకి జోడిగా కాజల్ అగర్వాల్ నటిస్తున్న ఈ సినిమాలో యువ కథానాయక శ్రీ లీల ప్రధాన పాత్రలో కనిపించనున్నారు మరొక హీరోయిన్ లల్వాని కి కీలకపాత్రలో నటించే అవకాశం దక్కింది. దీంతో ఈ రెండు సినిమాల మధ్య మంచి పోటీ ఏర్పడింది ఈ సీజన్ ని బాలయ్యే దున్నేస్తాడా.. బాలయ్య వర్సెస్ విజయ్ లో విజేత ఎవరు తెలియాలంటే దసరా వరకు వేచి చూడాల్సిందే.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -