Balakrishna: బాలకృష్ణ సినిమాను తొక్కేయడానికి ప్లాన్ చేస్తున్నది వాళ్లేనా?

Balakrishna: ఏంటి!బాలయ్య బాబు సినిమాను తొక్కడానికి ప్రయత్నిస్తున్నారా అంటే ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. బాలయ్య బాబు ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది సంక్రాంతి పండుగకు వీర సింహారెడ్డి సినిమాతో ప్రేక్షకులను పలకరించిన బాలయ్య బాబు ఇప్పుడు దసరా పండుగకు భగవత్ కేసరి సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పూర్తి అయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

కాగా భగవంత్ కేసరి సినిమా బాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ డూపర్ హిట్ సినిమాకి ఖుదూ గువా సినిమా కి సీక్వెల్ గా రాబోతుంది అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు. ఖుదు గువా అనే సినిమా కాన్సెప్ట్ ప్రకారం హీరో తన గర్ల్ ఫ్రెండ్ కి ఇచ్చిన మాట కోసం శత్రువుని చంపి తన బెస్ట్ ఫ్రెండ్ కోసం జైలుకెళ్తాడు. అయితే తన తండ్రి ఎవరో ఎలా ఉంటాడో తెలియకుండానే ఆ కూతురు పెరుగుతుంది. అతను జైలు నుండి బయటకు వచ్చే సమయానికి తన కూతురు ప్రమాదంలో ఉందని తనకు ప్రాణహాని ఉందని తెలుసుకున్న ఆ తండ్రి తన బిడ్డను ఎలా కాపాడగలుగుతాడు. శత్రువుల నుంచి తన బిడ్డను ఎలా కాపాడుతూ వాళ్లకు బుద్ధి వచ్చేలా చేస్తాడు. ఆ తర్వాత తన బిడ్డకు అసలు నిజాన్ని ఎలా చేరవేస్తాడు అనేది సినిమా కాన్సెప్ట్. అయితే సేమ్ టు సేమ్ భగవంత్ కేసరి సినిమా కూడా ఇలాగే ఉండబోతుంది అంటూ ప్రచారం జరుగుతోంది.

 

ఈ సినిమాల్లో బాలయ్య అలాగే కనిపించబోతున్నాడు అంటూ కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. దీంతో ఈ సినిమా మొత్తం ఖుదు గువా సినిమాకు కాపీనా? అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇది ఆ సినిమాకి కాపీ కాదు కానీ ఇంచుమించు స్టోరీ అలానే ఉంటుందని కానీ బాలయ్య ఏ సినిమానైనా తనదైన స్టైల్ లో డిఫరెంట్ గా మార్చేయగలుగుతాడని చెప్పుకొస్తున్నారు ఫ్యాన్స్. మరి ఈ విషయంపై అనిల్ రావిపూడి మూవీ మేకర్స్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -