Keerthi Vijay: కీర్తి, విజయ కార్తీక్ నిశ్చితార్థం డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

Keerthi Vijay: బుల్లితెర నటిగా బిగ్ బాస్ కంటెస్టెంట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి నటి కీర్తి భట్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న విషయం మనకు తెలిసిందే. ఈమె నటుడు విజయ కార్తీక్ ను వివాహం చేసుకోబోతున్నారు. ఇక ఈ విషయాన్ని వీరిద్దరూ ఓ బుల్లితెర కార్యక్రమంలో తెలియజేయడమే కాకుండా ఇద్దరు కూడా దండలు మార్చుకున్న విషయం మనకు తెలిసిందే.

ఇకపోతే వీరి పెళ్లి వేడుకలు మొదలయ్యాయని తెలుస్తుంది.రోడ్డు ప్రమాదంలో కీర్తి కుటుంబ సభ్యులందరూ మరణించారు ఒంటరిగా జీవితంలో ముందుకు పయనిస్తోంది అంతేకాకుండా ఈ ప్రమాదంలో ఈమె తల్లి అయ్యే భాగ్యాన్ని కూడా కోల్పోయారు. అయితే ఈమె తమ వంశాన్ని ముందుకు తీసుకెళ్లలేదని తెలిసినప్పటికీ కార్తీక్ తల్లిదండ్రులు ఆమెను తన ఇంటి కోడలుగా చేసుకోవడానికి ఒప్పుకున్నారు.

 

మాకు పిల్లలు లేకపోయినా పరవాలేదు నువ్వే మా చిన్న పిల్లవి అవసరమైతే పిల్లలను దత్తత తీసుకుందామంటూ పెద్ద మనసుతో కీర్తిని తమ ఇంటి కోడలుగా చేసుకోబోతున్నారు. త్వరలోనే కీర్తి కార్తిక్ నిశ్చితార్థపు వేడుక ఎంతో ఘనంగా జరగబోతుందని తెలుస్తుంది. ఈ క్రమంలోని వీరిద్దరూ జంటగా వెళ్లి పలువురు సెలబ్రిటీలను తమ నిశ్చితార్థానికి ఆహ్వానిస్తున్నారు. ఈ క్రమంలోనే జానకి కలగనలేదు షూటింగ్ లోకేషన్ కి వెళ్లి ఈ జంట అందరిని తమ నిశ్చితార్థానికి ఆహ్వానించారు.

 

ఈ క్రమంలోనే ఈ విషయాన్ని జానకి కలగనలేదు సీరియల్ నటి ప్రియాంక జైన్ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా షేర్ చేశారు. కీర్తి, కార్తీక్ ఆగస్టు 20వ తేదీ బేగంపేట్ లో వీరి నిశ్చితార్థం జరగబోతుందని ఈమె వెల్లడించారు. ఇలా కీర్తి నిశ్చితార్థం జరగబోతుంది అంటూ ప్రియాంక వీడియోని షేర్ చేయడంతో అభిమానులు ముందుగానే కీర్తి కార్తీక్ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -