Rashmika: రష్మిక చేసిన ఆ తప్పు వల్ల చిరంజీవి, విజయ్ బాధ పడ్డారా?

Rashmika: టాలీవుడ్ హీరోయిన్ రష్మిక మందన గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం రష్మిక వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ గా మారింది రష్మిక. పుష్ప మూవీ తర్వాత ఈ ముద్దుగుమ్మ క్రేజ్ మరింత పెరిగింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రష్మిక టాలీవుడ్ లో అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ని కూడా పూర్తి చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.

అలాగే బాలీవుడ్ లో యానిమల్ అనే సినిమాలో నటిస్తోంది. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు సమయం దొరికినప్పుడల్లా వెకేషన్ లు తిరుగుతూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తోంది. ఇప్పటివరకు కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళ, హిందీ సినిమాలలో కూడా నటించి మెప్పించింది రష్మిక. కాగా రష్మిక హిందీ చిత్రాలతో బిజీగా ఉండటం వల్లో, ఇతర కారణాల వల్లో గానీ ఇటీవల టాలీవుడ్‌లో అవకాశాలను జారవిడుచుకుంటోంది. కాగా ఈ భామ ఇటీవల ఒక భేటీలో తన సినీ జీవితం గురించి తెలుపుతూ కష్టపడి పని చేస్తే ఏ రంగంలోనైనా నంబర్‌ వన్‌ కావచ్చని తెలిపింది. తాను ప్రారంభ దశలో మోడలింగ్‌ చేసి ఆ తర్వాత నటిగా పరిచయం అయినట్లు తెలిపింది.

 

సినిమా రంగంలో అదృష్టం చాలా ముఖ్యమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. తాను తెలుగులో మెగాస్టార్‌ చిరంజీవి ఆచార్య సినిమాతో పాటు తమిళంలో విజయ్‌ సూపర్‌ హిట్‌ సినిమా మాస్టర్‌ వంటి చిత్రాల్లో నటించే అవకాశాలు వచ్చినా, చేజార్చుకున్నానని తెలిపింది. అంత పెద్దస్టార్స్‌ తో నటించే అవకాశం రావడం నిజంగా అదృష్టమని, అలాంటిది ఆ అవకాశాలను వదులుకోవడం బాధనిపించిందని పేర్కొంది. సినిమా రంగంలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేమని పేర్కొంది. ప్రేమ పెళ్లి అనేది కొన్ని సమయాల్లో విడదీయలేని బంధం అవుతాయని పేర్కొంది. అయితే కొన్ని సార్లు అవి బలహీనంగా కూడా మారతాయని చెప్పింది.

 

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -