Samantha: ఆ ఒక్క రీజన్ వల్లే స్టార్ హీరోయిన్ సమంత ముఖం వాచిపోయిందా?

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాలకు విరామం ప్రకటించి వెకేషన్ లో ఉన్న విషయం మనకు తెలిసిందే. ఈమె గత కొంతకాలం క్రితం మైయోసైటిస్ వ్యాధి బారిన పడ్డారు. అయితే ఈ వ్యాధి పూర్తి నయం కాకుండానే తాను కమిట్ అయిన సినిమా షూటింగ్ పనులు ఆలస్యం అవుతాయన్న ఉద్దేశంతో తిరిగి షూటింగ్ పనులకు హాజరయ్యారు.

ఇలా సమంత కమిట్ అయినటువంటి సిటాడెల్ అనే వెబ్ సిరీస్ అదేవిధంగా ఖుషి సినిమా షూటింగ్ పనులను పూర్తి చేసుకున్నారు.ఇలా తాను కమిట్ అయిన సినిమా షూటింగ్ పనులను పూర్తి చేసుకున్నటువంటి సమంత ఇతర సినిమాలకు కమిట్ అవ్వలేదు. ఇలా కొత్త ప్రాజెక్టులకు కమిట్ అవ్వకుండా ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉంటున్నానని ప్రకటించారు. ఇలా సినిమాలకు దూరంగా ఉన్నటువంటి సమంత ప్రస్తుతం బాలి వెకేషన్ లో ఉన్నారు.

 

ఈ లొకేషన్ లో భాగంగా సమంత ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ తన మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.ఇక సమంత ఈ వెకేషన్ కి సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు. సమంత షేర్ చేసిన ఒక ఫోటోలో కనుక చూస్తే అందులో తన మొహం మొత్తం పూర్తిగా వాచిపోయినట్టు కనపడుతుంది.

 

ఇలా సమంత రూపురేఖలలో పెద్ద ఎత్తున మార్పులు కనిపించాయి ఇలా మొహం మొత్తం వాచిపోయి ఉండటంతో అసలు సమంతకుఏమైంది ఎందుకు ఇలా రూప రేఖలు మారిపోయాయి అంటూ పలువురు కామెంట్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈమె మయూసైటిస్ వ్యాధితో పోరాడుతున్న విషయం తెలిసిందే. ఈ వ్యాధి కారణంగానే సమంత ఇలా మారిపోయారని తెలుస్తుంది. ఏది ఏమైనా సమంత పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -