Bro Movie: ఆ సినిమా నుంచి బ్రో మూవీని కాపీ కొట్టారా.. అసలేమైందంటే?

Bro Movie: ఇటీవలె సాయి ధరమ్ తేజ్, పవన్ కళ్యాణ్ కలిసి నటించిన బ్రో సినిమా విడుదలైన విషయం తెలిసిందే. ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు ఇటీవలె విడుదల అయ్యి మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంది. పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ సినిమాని సూపర్ అంటుండగా మిగిలిన ప్రేక్షకులు మాత్రం పర్వాలేదు అని అంటున్నారు. కామ‌న్ ఆడియెన్స్‌కు మాత్రం బ్రో బిలో యావ‌రేజ్‌ సినిమాగా మిగిలిపోయింది. అయితే సినిమా చూసిన కొందరు నెటిజన్లు బ్రో సినిమాపై రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

ఎప్పుడో 15 సంవత్సరాల క్రితం మంచి విష్ణు,నాగార్జున కలిసి నటించిన కృష్ణార్జున సినిమా నుంచి చాలా సీన్లు కాపీ కొట్టి బ్రో సినిమా తీశారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. సినిమా క్లైమాక్స్, మూవీలో చాలా డైలాగులు జీవితం, కాలం, కర్మ గురించి నాగార్జున కృష్ణార్జున సినిమాలో చెప్పినవే ఇక్కడ వాడేసారని ఆధారాలతో సహా కామెంట్లు చేస్తున్నారు. బ్రో సినిమాలో జీవితం, టైం గురించి నాగార్జున మంచి విష్ణుకు ఉపదేశించే సీన్లు స్క్రీన్ షాట్లు పెట్టి మరి బ్రో సినిమాతో పోలుస్తున్నారు. మంచి విష్ణు, నాగార్జున‌ ఎలా ? యాక్ట్‌ చేశారో సేమ్ టు సేమ్ బ్రో సినిమాలోనూ పవన్ కళ్యాణ్, సాయి ధరంతేజ్ కూడా అలాగే కలిసి నటించారని విమర్శలు చేస్తున్నారు.

 

ముఖ్యంగా కాలం, కర్మ గురించి చాలా డైలాగులు కృష్ణార్జున సినిమాలో డైలాగులను కాపీ కొట్టి బ్రోలో వాడినట్టుగా ఉన్నాయని ఒక నెటిజన్ కామెంట్ చేశాడు. ఇక పవన్ కళ్యాణ్,సాయి ధరమ్ తేజ్ కలిసి డ్యాన్సులు చేయడం కూడా కృష్ణార్జున సినిమాలో మంచు విష్ణు,నాగార్జున కలిసి డ్యాన్స్ చేసినట్టుగానే ఉందని చెబుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -