Beds: ఇంట్లో అన్ని మంచాలు ఉంటే అరిష్టమా.. ఏ పని చేసినా కలిసొచ్చే ఛాన్స్ లేదా?

Beds: వాస్తు శాస్త్ర ప్రకారంగా మన ఇంట్లో ఉండే అన్ని రకాల వస్తువులు, మూలలో దిశలకు తప్పనిసరిగా నియమాలు ఉన్నాయి. అందులో మనం నిద్రించే మంచానికి సంబంధించి కూడా అనేక నియమాలు ఉన్నాయి. మంచాన్ని ఏ దిశలో ఉంచాలి? మంచంపై పడుకునేటప్పుడు ఏ దిక్కున తలపెట్టి నిద్రపోవాలి?ఏ దిక్కులో మంచం పెట్టుకోవాలి? ఇటువంటి విషయాలు అన్నింటినీ కూడా క‌చ్చితంగా ప్రతి ఒక్కరూ పాటించాలి. అలానే ఇంట్లో ఎన్ని మంచాలు ఉండాలి అనే దానికి కూడా కారణం ఉంది..చాలా మందిలో మూడు అనే సంఖ్యపై కొన్ని వ్యతిరేకమైన భావనలు ఉన్నాయి. మూడు ముడి పడదు అని అంటారు.

మూడు కంచాలలో వడ్డించకూడదంటారు. అలానే మూడు దీపాలని వెలిగించకూడదంటారు. అలానే మూడు మంచాలు కూడా ఉండకూడదా అని సందేహం చాలా మందిలో ఉంటుంది. ఆ వివరాల్లోకి వెళితే.. కేవలం ప్రయాణానికి మాత్రమే ఈ మూడు సంఖ్య గురించి చెప్పబడింది. కనుక శాస్త్రంలో మూడు అనే సంఖ్యకి ఎలాంటి నిషిద్ధము కూడా లేదు. మూడు కంచాలలో భోజనం వడ్డించకూడదు. మూడు మంచాలు ఇంట్లో ఉండకూడదు అనేది వ్యక్తిగతంగా ఉండే అభిప్రాయమే. కానీ శాస్త్రపూర్వకంగా వర్తించదు. భార్య, భర్తలు ఎప్పుడు ఒకే మంచం మీద పడుకోవాలి. భర్త ఇంట్లో ఉండగా భార్య మరొక మంచం మీద కానీ కింద కానీ నిద్రపోకూడదు.

 

ఎన్ని విభేదాలు ఉన్నా, ఎన్ని మనస్పర్ధలు ఉన్నా కూడా ఒకే మంచం మీద నిద్రపోవాలని శాస్త్రం చెప్తోంది. అలాగే మంచం మీద నిద్రించే ముందు మంచాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. మంచం మీద అనవసరంగా ఎక్కి తొక్క కూడదు. మంచం మీద కూర్చుని తినకూడదు. మంచం మీద కూర్చుని తినడం వలన ఇంట్లో సంపద ఎక్కువ కాలం ఉండదు. మంచం మానవుడికి ప్రపంచంలో ఉన్న సమస్యల్ని, కష్టాలని, బాధల్ని అన్నీ మరిచిపోయి మనిషికి నిద్రని కలిగిస్తుంది. అందుకని మంచాన్ని దూషించకూడద‌ని అంటుంటారు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -