Tollywood: ఉమైర్ సంధు.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇటీవల కాలంలో టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో ఎక్కువగా మారుమోగుతున్న పేరు. ఇదివరకు కేవలం సినిమాల రివ్యూలు మాత్రమే ఇచ్చిన క్రిటిక్ ఉమైర్ సంధు ఈ మధ్యకాలంలో మరింత రెచ్చిపోయి నోటికి ఎంత వస్తే అంత ఊహించుకొని తనకు తోచిన విధంగా సంచలన ట్వీట్స్ చేస్తున్నాడు. అంతే కాకుండా హీరో హీరోయిన్ లకు మధ్య ఎఫైర్లు అంటగడుతున్నాడు. ఇటీవల కాలంలో ఉమైర్ సంధు అడ్డు అదుపు లేకుండా పోయిందని చెప్పవచ్చు.
నిత్యం ఎవరో ఒకరిని సెలబ్రిటీలను టార్గెట్ చేయడం వారి గురించి వారి పర్సనల్ విషయాల గురించి లేనిపోనివన్నీ క్రియేట్ చేసి కాంట్రవర్సీలను కొని తెచ్చుకుంటున్నాడు. తాజాగా కూడా సౌత్ సెలబ్రిటీలపై సంచలన వాఖ్యలు చేసి మరోసారి వార్తల్లో నిలిచాడు. సౌత్ సినీ ఇండస్ట్రీ హీరోలు బిగ్గెస్ట్ సెక్సువల్లీ ప్రిడేటర్స్ అంటూ కామెంట్ చేశాడు. 1980,90ల్లోనే కొందరు స్టార్ హీరోలు తమ సినిమాల్లో నటించిన కొందరు నటీమణులను ఇబ్బంది పెట్టారంటూ సంచలన ఆరోపణలు చేశాడు. దక్షిణాది నటులు ఫీమేల్ యాక్టర్లను అస్సలు గౌరవించరని, వారిని సె**క్స్ డాల్స్లా చూస్తూ ఉంటారని ఈ విషయాలపై విచారణ జరపాలంటూ డిమాండ్ చేశాడు.
తెలుగు, తమిళ సినీ రంగంలో ఇలాంటి నటుల గురించి ఎక్స్ఫోజ్ చేసేందుకు తాను ముందు ఉంటానని ఉమైర్ చెప్పాడు. అయితే తెలుగు, తమిళ సినీ అభిమానులు మాత్రం నువ్వు ఈ చెత్త కామెంట్లు మానుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వార్నింగ్లు ఇస్తున్నారు. అంతేకాకుండా అతన్ని ఎవరైనా పిచ్చాసుపత్రిలో చేర్పించండి పిచ్చిపిచ్చిగా వాగుతున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.